మంగళవారం 14 జూలై 2020
Beauty-tips - Jun 20, 2020 , 15:10:41

అందాన్ని.. ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచేందుకు మ‌ల్లెల ర‌సం!

అందాన్ని.. ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచేందుకు మ‌ల్లెల ర‌సం!

మ‌ల్లెపూలు క‌నిపిస్తే చాలు.. మ‌గువ‌లు త‌ల‌లో పెట్టుకోకుండా ఉండలేరు. ఇవి మంచి సువాస‌నను వెద‌జ‌ల్ల‌డంతోపాటు జ‌డ అందాన్ని పెంచుతాయి. అంతేనా.. అల‌కర‌ణ‌కు మ‌ల్లెపూలు ఎంతో తోడ్ప‌డుతాయి. అయితే మ‌న‌కు తెలియ‌ని మ‌రో విష‌యం ఏమిటంటే.. మ‌ల్లెపూల ర‌సం ఆరోగ్యాన్ని, అందాన్ని రెట్టింపు చేస్తుంద‌న‌డంలో ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. 

* మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 

* కళ్లు బాగా అలసటగా ఉన్నప్పుడు మల్లెపూల రసంతో కంటి చుట్టు భాగాల్లో మర్దన చేసుకొని పడుకుంటే చల్లగా ఉంటుంది.

* అరోమాథెరపీలో కూడా ఇప్పుడు మల్లెపూలను వాడుతున్నారు. 

* సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాల్లో కూడా నేడు మల్లెపూలను వాడుతున్నారు.

* చర్మానికి అవసరమయ్యే విటమిన్ సి మల్లెపూలలో పుష్కలంగా దొరుకుతుంది.

* కొబ్బరినూనెతో కలిపి మల్లెపూల రసాన్ని తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది. 

* మొటిమల వల్ల వచ్చే మచ్చలకు మల్లెల నూనె రాస్తే ఫలితం ఉంటుంది. 

* చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టించవచ్చు.

* మల్లెల సువాసన నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.

* మల్లెపూలతో తయారు చేసే పలు ఔషధాలు కణితులను కూడా నివారిస్తాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.logo