బుధవారం 03 జూన్ 2020
Beauty-tips - Mar 31, 2020 , 11:40:42

గోళ్లపై జెల్‌ను తొల‌గించుకునేందుకు ఇదే స‌మ‌యం

గోళ్లపై జెల్‌ను తొల‌గించుకునేందుకు ఇదే స‌మ‌యం


ఆఫీసుకు వెళ్లేట‌ప్పుడు చాలా డిగ్నిటీగా త‌యారై వెళ్తుంటారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆ ప‌ని త‌ప్పింది. ఇంట్లోనే కాబ‌ట్టి ప్ర‌త్యేకంగా రెడీ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. కాక‌పోతే ఇంత‌కుముందు గోర్లకు పెట్టుకున్న నెయిల్‌పాలిస్ ఉంటుంది క‌దా. దానికి క‌రోనా టైంలో ఉంచుకోవ‌డం అంత మంచిది కాదు. అందుకే గోర్లపై ఉన్న జెల్‌ను రిమూవ్ చేయ‌డానికి లండ‌న్‌కు చెందిన ఇమ‌ర్ని అష్మాన్ కొన్ని టిప్స్ చెబుతున్నది. అక్కడ కలర్డు లండ‌న్ నైల్స్‌ పేరుతో సెలూన్ కూడా న‌డుపుతున్నది. 

కావాల్సిన ప‌దార్థాలు :

100 శాతం యాసిటాన్‌, దూది, లావుగా ఉండే రేకు, హైడ్రేటింగ్ క్యూటిక‌ల్ ఆయిల్‌.

పద్దతి :

1. ముందుగా న‌చ్చిన‌ట్టుగా గోర్ల‌ను క‌త్తిరించుకోవాలి.

2. ఆ త‌ర్వాత గోర్లు గ‌రుకుగా ఉండ‌కుండా ఉండేందుకు ఫైల్ చేసుకోవాలి. ఇప్ప‌డు ఒక‌సారి ఒక లేయ‌ర్‌గా నెయిల్‌పాలిస్ వేయాలి. త‌ర్వాత మ‌ళ్ళీ ఫైల్ చేయాలి.

3. దూదిని యాసిటాన్‌లో ముంచి గోరుపై పెట్టాలి. దానిపై ఫాయిల్ పెట్టి చుట్టాలి.

4. 30 నిమిషాల‌పాటు అలానే ఉంచాలి.

5. అలా అన్ని వేళ్ల‌కు చుట్టాలి. త‌ర్వాత ఒకేసారి ఫాయిల్ తీసివేయాలి. 

6. శుభ్రంగా ఉన్న గోర్ల‌పైన షైనింగ్ నెయిల్‌పాలిష్ అప్లై చేసుకోవాలి. దీంతో ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌దు.

7. యాసిటోన్‌తో గోర్ల‌ను క్లీన్ చేయ‌డం వ‌ల్ల అవి తొంద‌ర‌గా డ్రై అయిపోతాయి. అందుకు హైడ్రేటింగ్ క్యూటిక‌ల్ ఆయిల్‌లో గోర్ల‌ను ముంచాలి. దీంతో గోర్ల‌కు విట‌మిన్స్ ల‌భించి పొడిబార‌కుండా ఉంచుతుంది.


logo