ఆర్థరైటిస్ ఉన్నవారు టమోటాలు తినకూడదా..?

ఆర్థరైటిస్(కీళ్ల వాపు, కీళ్ల నొప్పులు) ఉన్నవారికి టమోటాలకు పొసగదట. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు టమోటాలు ఎందుకు తినకూడదు. తింటే ఏమవుతుంది. ఇది తెలుసుకునే ముందు.. ఆర్థరైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం..ఆర్థరైటిస్‌లో కనిపించే ప్రధాన లక్షణం జాయింటుల్లో నొప్పి. కొన్నిరకాల ఆర్థరైటిస్‌ల వల్ల అవయవాలపై ప్రభావం పడుతుంది. జాయింటుల్లో నొప్పి, వాపు, కీళ్లు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ వ్యాధి అనేక రూపాల్లో రావొచ్చు. అవి అస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సూడోగౌట్, సొరియాటిక్ ఆర్థరైటిస్, అంకైలోజింగ్ స్పాండిలైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్. వయసు పైబడిన కొద్దీ కీళ్లు అరిగి నొప్పులు వస్తాయి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందట.
* ఆర్థరైటిస్ ఉన్నవారు టమోటాలు తినకూడదా..?
కీళ్లనొప్పులు, కీళ్ల వాపులు ఉన్నవారు ముఖ్యంగా తాము తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే.. టమోటాల్లో సహజంగా ఉండే సొలనైన్ అనే టాక్సిన్ కీళ్ల వాపులు పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో పాటు బంగాళదుంపలు, వంకాయలు, క్యాప్సికమ్ లాంటి కూరగాయలు కూడా కీళ్లవాపులు ఉన్నవారికి మంచివి కావని చెబుతుంటారు.
సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం.. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు టమోటాలు తినడం వల్ల సమస్య పెరుగుతుంది అనడానికి ఎక్కడా రుజువులు లేవట. టమోటా ఆకుల కారణంగా కీళ్ల వాపులు పెరుగుతాయని అంతా అనుకుంటారు. నిజానికి టమోటా ఆకుల్లో ఉండే విషం టమోటాలను ఫంగస్ నుంచి జంతువుల నుంచి కాపాడుతాయట. కాబట్టి ఆర్థరైటిస్ ఉన్నవారు టమోటాలు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు.
తాజావార్తలు
- వీడీసీసీతో సమస్యలుండవ్
- పారిశ్రామిక వాడలో పచ్చదనం
- పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి
- స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
- సామాన్యుడిలా సంజయ్‌కుమార్
- వచ్చే నెల ఒకటి నుంచి ‘కేసీఆర్ కప్' టోర్నీ
- ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే పోటీలు
- ఊర చెరువుకు పైపులైన్ వేయించాలి
- రాయపేట రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వాలి