సోమవారం 25 మే 2020
Beauty-tips - Mar 14, 2020 , 13:17:44

వేసవిలో ఎండల నుండి చర్మాన్ని సంరక్షించుకోండిలా?

వేసవిలో ఎండల నుండి  చర్మాన్ని సంరక్షించుకోండిలా?

ఎండకు వెళితే చర్మం కమిలిపోతుంది. మరి గుచ్చే ఎండ నుంచి మన చర్మాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

  • -          ఒక పరిశోధనలో తేలిందంటంటే.. రోజూ అలోవెరా జెల్‌ని రాయడం వల్ల చర్మం ఎప్పుడూ పొడిబారకుండా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ చర్మాన్ని చల్లబర్చడానికి, నల్లని మచ్చలను తొలిగించడానికి ఉపయోగపడుతాయి.
  • -          షియా బటర్‌లో అధిక సాంద్రత, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా ఉంచుతాయి. దీంట్లో ఉండే నూనెలో చర్మంలోకి వేగంగా కలిసిపోయి, చర్మంలోని తేమను పునరుద్ధరిస్తాయి. బయట వాతావరణం నుంచి చర్మాన్ని ఈ బటర్‌ రక్షిస్తుందన్నమాట.
  • -          రాస్‌బెర్రీ విత్తనాల నుంచి వచ్చే నూనె జింక్‌ ఆక్సైడ్‌కు సమానమైన ఎస్‌పీఎఫ్‌ 20ని అందిస్తుంది. ఇందులో ఓమెగా 3, ఆరు కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి రక్షించే సామర్థ్యం ఈ రాస్‌బెర్రీ విత్తన నూనెల్లో అధికం. ఇందులో ఉండే విటమిన్‌ ఎ, ఈ ల వల్ల చర్మవ్యాధులు కూడా దరిచేరవు.
  • -          బాదం నూనె చర్మాన్ని యూవీ కిరణాల నుంచి దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే ఇప్పటివరకు చర్మం ఏదైనా డ్యామేజ్‌ అయితే కూడా ఇది రిపేర్‌ చేస్తుంది. వృద్ధాప్య చాయలు రాకుండా ఈ నూనె రక్షిస్తుంది. 


logo