శుక్రవారం 10 జూలై 2020
Beauty-tips - Mar 14, 2020 , 16:50:51

అవాంఛిత రోమాలు ఎలా తొలగించుకోవాలి?

అవాంఛిత రోమాలు ఎలా తొలగించుకోవాలి?

అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి బ్యూటీపార్లర్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రోజుకు రెండు కప్పుల పుదీనా రసం తీసుకోమంటున్నారు పరిశోధకులు. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ వల్ల మహిళల ముఖంపై పెరిగే అనవసర వెంట్రుకలను నివారించవచ్చని టర్కీ శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా స్త్రీ, పురుష లైంగిక హార్మోన్లు ఇద్దరిలోనూ ఉంటాయి. కాని పురుషుల్లో మీసాలు, గడ్డాలు రావడానికి తోడ్పడే టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల మోతాదు మహిళల్లో చాలా తక్కువగా ఉంటుంది. కొందరిలో మాత్రం అనేక కారణాల వల్ల టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ మోతాదు ఎక్కువ అవుతుంది. ఫలితంగా వీరిలో కూడా ముఖంపై రోమాల పెరుగుదల కనిపిస్తుంది. ఈ స్థితినే హిర్సుటిజమ్‌ అంటారు. ఈ హార్మోన్‌ ఉత్పత్తిని అణచివేసే మందుల వల్ల కొంతవరకు ఫలితం ఉన్నా, వీటివల్ల ఇతర దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు పుదీనాలో టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తిని తగ్గించే గుణాలున్నాయని ఈ కొత్త తపరిశోధన తెలుపుతున్నది. వాంతులు, వికారంగా ఉండడం, జీర్ణశక్తి లోపించడం జలుబు, సైనసైటిస్‌ వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేసే పుదీనా హిర్సుటిజమ్‌ను తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. 21 మంది మహిళలను అధ్యయనం చేసిన అనంతరం డాక్టర్‌ ఖుర్షీద్‌ నావెడ్‌ ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నారు. అయితే ఈ దిశగా మరింత పరిశోధన జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. 


logo