గురువారం 13 ఆగస్టు 2020
Beauty-tips - Jul 27, 2020 , 17:08:15

చ‌ర్మానికి కావాల్సిన 'విట‌మిన్ సి' సీర‌మ్‌ను ఇంట్లోనే త‌యారు చేసుకోండిలా!

చ‌ర్మానికి కావాల్సిన 'విట‌మిన్ సి' సీర‌మ్‌ను ఇంట్లోనే త‌యారు చేసుకోండిలా!

చ‌ర్మం రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి ఆయిల్ ఫేస్‌. రెండోది డ్రై ఫేస్‌. చ‌ర్మానికి త‌గిన‌ట్లుగానే సీరంలు కూడా రెండు ర‌కాలుగా ఉంటాయి. వాట‌ర్ బేస్డ్ సీరం, ఆయిల్ బేస్డ్ సీరం. స్కిన్‌ని బ‌ట్టి సీరంని ఎంచుకోవాల్సి వ‌స్తుంది. డ్రై స్కిన్ అయితే 'విట‌మిన్ ఈ' ఉన్న సీరం ఎంచుకోవాలి. స్కిన్ గ్లో లేకుండా డ‌ల్‌గా క‌నిపిస్తుంటే 'విటమిన్ సి' ఎంచుకోవ‌డం ఉత్త‌మం. ఎక్కువ‌మంది 'విట‌మిన్ సి' సీరంనే ఎంచుకుంటారు. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడి స్కిన్ ని యంగ్ గా కనిపించేటట్లు చేస్తుంది. స్కిన్ రిపెయిర్ కి సహకరిస్తుంది. ఈ సీర‌మ్‌లు కొనాలంటే ఎక్కువ ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. అందుక‌ని వాటి జోలికి కూడా వెళ్ల‌ట్లేదు. అందుకే త‌క్కువ ఖ‌ర్చుతో ఇంట్లోనే 'విట‌మిన్ సి' సీరంను త‌యారు చేసేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు :

విటమిన్ సి పౌడర్ - ఒక టీస్పూన్

రోజ్ వాటర్ : 8 టీ స్పూన్లు

గ్లిజ‌రిన్ - ఒక టీస్పూన్

విటమిన్ ఈ కాప్స్యూల్స్ : 2

తయారు చేసే పద్ధతి :

ముందుగా ఒక గ్లాస్ బాటిల్‌ను తీసుకొని బాగా శుభ్రం చేయాలి. త‌ర్వాత త‌డిలేకుండా ఆర‌బెట్టాలి. ఇందులో విట‌మిన్ సి పౌడ‌ర్‌, రోజ్‌వాట‌ర్ వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు గ్లిజ‌రిన్‌, విట‌మిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవ‌న్నీ బాగా క‌లిసేలా బాగా క‌లిపిన త‌ర్వాత ఫ్రిజ్‌లో పెట్టి 20 రోజుల వ‌ర‌కు ముఖానికి రాసుకోవ‌చ్చు.

వాడే విధానం :

రాత్రి ప‌డుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. త‌ర్వాత ముఖానికి రోజ్ వాట‌ర్ కాని టోన‌ర్ కాని అప్లై చేయాలి. ఐదు నిమిషాల త‌ర్వాత  నాలుగు చుక్క‌ల సీరంని ముఖానికి రాసుకోవాలి. ఆ త‌‌ర్వాత కాసేపు మెల్ల‌గా మ‌ర్ద‌న చేయాలి. ఒక‌రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా ప్ర‌తిరోజూ ఇలా చేస్తూ ఉంటే చ‌ర్మంపై ఎలాంటి మ‌చ్చ‌లు లేకుండా కాంతివంతంగా త‌యార‌వుతుంది. మొద‌ట్లో కొంచెం చిరాగ్గా అనిపించినా త‌ర్వాత అల‌వాటైపోద్ది. logo