బుధవారం 05 ఆగస్టు 2020
Beauty-tips - Jul 30, 2020 , 20:25:16

అందంగా మెరిసిపోవాల‌నుకుంటున్నారా? మ‌రి బాదం క్రీమ్‌ను త‌యారు చేసుకోండి!

అందంగా మెరిసిపోవాల‌నుకుంటున్నారా?  మ‌రి బాదం క్రీమ్‌ను త‌యారు చేసుకోండి!

అందంగా మెరిసిపోవాలని ప్ర‌తిఒక్క‌రికీ ఉంటుంది. ముఖ్యంగా మ‌గువ‌లు దీనికోసం ప్ర‌త్య‌క‌మైన కేర్ తీసుకుంటారు. ఫేషియ‌ల్, క్రీమ్స్ కావాలంటూ బ్యూటీపార్ల‌ర్ చుట్టూ తిరుగుతుంటారు. సంపాదించేదంతా స‌గం వీటికే ఖ‌ర్చుచేస్తుంటారు. అలా కాకుండా అందానికి క‌వాల్సిన బాదం క్రీమ్‌ను ఇంట్లోనే త‌యారు చేసుకుంటే అటు నేచుర‌ల్‌గానూ, త‌క్కువ ఖ‌ర్చుతో అయిపోతుంది. 

బాదం క్రీంకు కావలసిన పదార్ధాలు :

బాదం పప్పులు : 8 

ఆల్మండ్ ఆయిల్ : 1 టేబుల్స్పూన్

విటమిన్ ఈ కాప్స్యూల్స్ : 2

అలోవేరా జెల్ : ఒక టేబుల్‌స్పూన్‌

రోజ్ వాటర్ : ఒక టేబుల్ స్పూన్.

తయారీ :

ముందుగా బాదం పప్పులను రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత, వాటిమీద ఉన్న‌ పొట్టుని తీసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రోజ్ వాటర్ వేసి కలుపాలి.  ఈ పేస్ట్‌ని ఫిల్ట‌ర్ చేసి మిల్క్‌ని వేరు చేయాలి. త‌ర్వాత ఈ పేస్టులో ఆల్మండ్ ఆయిల్‌, విట‌మిన్ ఈ కాప్స్యూల్స్ ఆయిల్ వేసి బాగా కలుపాలి. ఇందులో అలోవెరా జెల్ వేసి బాగా క‌లుపాలి. బాగా క‌లిపిన ఈ మిశ్ర‌మాన్ని రూం ఉష్ణోగ్ర‌త వ‌ద్ద 30 రోజుల వ‌ర‌కు నిల్వ చేసుకోవ‌చ్చు.  

* బాదం చర్మాన్ని మెరిసేలా చేయడంతోపాటు, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. బాదం వలన మరో ప్రయోజనం కూడా ఉంది. ఇది సూర్యరశ్మి వలన చర్మానికి కలిగే నష్టాన్ని నివారిస్తుంది.

* రోజ్ వాటర్ మీ చర్మం నుంచి జిడ్డు, మురికిని తొలగించి ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

* విటమిన్ ఈ ఆయిల్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడంతోపాటు, ప్రకాశవంతంగా ఉంచుతుంది.

* అలోవేరా జెల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, ఎంజైమ్స్, విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అలోవేరా జెల్, మొటిమలు మరియు డ్రై స్కిన్ నివారణలో కూడా సహాయపడుతుంది.

* సూర్యరశ్మి వలన కలిగే నష్టాలను తగ్గించడంతోపాటుగా, డ్రై స్కిన్, ముఖంపై చారలు, మొటిమల నివారణలో కూడా బాదం సహాయపడుతుంది. 

* చర్మం మీద ముడతలు, బ్లాక్ హెడ్స్, డార్క్ సర్కిల్స్ నివారణలో సహాయపడుతూ యాంటీ ఏజింగ్ క్రీం లా పనిచేస్తుంది. అంతేకాకుండా, ముఖంపై మచ్చలను తొలగిస్తూ గ్రేడియంట్, క్రిస్టల్ క్లియర్ లుక్‌ను అందిస్తుంది.


logo