బుధవారం 08 జూలై 2020
Beauty-tips - Jun 02, 2020 , 14:13:41

వాచిన పెదాలతో ఇబ్బంది పడుతున్నారా?

వాచిన పెదాలతో ఇబ్బంది పడుతున్నారా?

చాలామంది పెదాలు వాడిపోయినట్టుగా, నిర్జీవంగా పేలవంగా తయారవుతాయి. కొందరికి పెదాలు వాపునకు గురవుతాయి. మరి ఈ సమస్య పరిష్కారానికి ఈ చిన్న చిట్కాలు పాటించండి.

* కొన్ని ఐస్‌ముక్కలను కాటన్‌ గుడ్డలో తీసుకోవాలి. వాటితో సున్నితంగా పెదాలపై మర్దన చేయాలి. రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయడం ద్వారా ఫలితం ఉంటుంది. ఐస్‌ముక్కలను నేరుగా పెదాలకు తాకించవద్దు.

* తాజా కలబంద నుంచి టీస్పూన్‌ జెల్‌ తీసుకోవాలి. వీలయినన్ని సార్లు పెదాలకు పూస్తే వాపు తగ్గుతుంది.

* తేనెను ఉపయోగించి ఈ సమస్యకు చెక్‌పెట్టొచ్చు . ఒక టీస్పూన్‌ తేనెలో కాటన్‌ బాల్‌ను ఉంచండి. చల్లని నీటితో మొహం కడిగి ఆ బాల్‌ను పెదాలపై మర్దన చేయండి.

* ఒక స్పూన్‌ పసుపును, చల్లని నీటితో కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై పూసి పది నిమిషాల తర్వాత తీసేయాలి. రోజులో మూడుసార్లు చేస్తే వాచిన పెదాలు తగ్గిపోతాయి. దీంతో పాటు ఏదైన నొప్పి ఉన్నా నయం అవుతుంది.


logo