గురువారం 03 డిసెంబర్ 2020
Beauty-tips - Nov 02, 2020 , 21:04:12

మగవాళ్లు నెయిల్ పాలిష్ వేసుకుంటే ఎలా ఉంటుంది

మగవాళ్లు నెయిల్ పాలిష్ వేసుకుంటే ఎలా ఉంటుంది

"మన్మథుడు" సినిమాలో అక్కినేని నాగార్జునకు ఓ అనుమానం . వస్తుంది అదేంటో మీకు గుర్తుందా? అదేనండీ.. "లిప్ స్టిక్ పెదవులకే ఎందుకు పెట్టుకోవాలి.. కళ్లకు ఎందుకు పెట్టుకోకూడదు అని". ఆయన అనుమానం అప్పుడే ప్రయోగం చేసి తీర్చుకున్నారనుకోండి. అది పక్కన పెడితే.. ఇప్పుడు అలాగే చాలా మందికి కలుగుతున్న మరో అనుమానం ఏంటంటే "నెయిల్ పాలిష్ మగవారు వేసుకుంటే ఎలా ఉంటోంది?". 

ఈ ప్రశ్న వినగానే.. ఎలా ఉంటోంది బాగానే ఉంటోంది అని కొందరు అంటుంటే. అబ్బే మగవారు నెయిల్ పాలీష్ వేసుకోవడం ఏంటని మరికొందరు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఆడమగ ఏంటండీ ఎవరైనా ఒకటే .. ఎవరి ఇష్టం వాళ్లది అని కొందరు భావిస్తున్నారు. అదీ నిజమే కదండీ.. ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది మగవారు మేకప్ చేసుకోవడం, ఫౌండేషన్ క్రీమ్స్ రాసుకోవడం, లిప్ స్టిక్ వేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. సాధారణంగా కూడా చాలా మంది పురుషులు చెవులకు కమ్మలు ధరించడం, ఆడవారిలా వెంట్రుకలు పెంచుకుని రకరకాల జడలు వేసుకోవడం.. చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఇలాంటివి మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు నెయిల్ పాలీష్ ఎందుకు వేసుకోకూడదు అనేది చాలా మంది అభిప్రాయం.

మన వైపు లేదు కానీ హాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు దీనికి సమాధానం చెప్పేశారు. అలంకరణ ఆడవారికే కాదు మగవారికి కూడా కావాల్సిందేనని తేల్చిచెప్పేశారు. గతంలోనే హాలీవుడ్ ప్రుముఖ డైరెక్టర్ హరీ స్టైల్స్,  డిజైనర్‌ నెయిల్ పాలీష్ వేసుకుని కనిపించారు. ఇదేం పెద్ద వింత కాదనీ.. అదీ ఓ రకమైన ష్యాషన్ అనీ చెప్పుకొచ్చారు. హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లు, మ్యుజీషియన్లు, ఫ్యాషన్ డిజైనర్లు చాలా మంది మగవారు నెయిల్ పాలీష్, వాటిపై డిజైన్లు వేసుకోవడం కొత్త ట్రెండ్ అంటున్నారు. అంతేకాదు మగవారు నెయిల్ పాలీష్ వేసుకుని మ్యూజిక్ ప్లే చేయడం, కాఫీ కప్పు పటుకోవడం వంటివి చాలా అందంగా ఉంటాయని చెప్పుకొచ్చారు కూడా.

మరి మగవారు నెయిల్ పాలీష్ వేసుకునే ట్రెండ్ మన టాలీవుడ్, బాలీవుడ్ కు ఎప్పుడొస్తుందో.. దాని గురించి ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో చూడాలి.