యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినండి..

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలని చాలా మంది అనుకుంటారు. ఎన్ని కోట్లు పెట్టినా..ఎలాంటి ప్రయోగాలు చేసినా పెరుగుతున్న వయసును మాత్రం ఎవ్వరూ ఆపలేరు. అయితే కాలంతో పాటు పెరుగుతున్న వయసును ఆపలేకపోయినా.. అది బయటకు కనపడకుండా దాచుకోవచ్చట. మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే.. పెరుగుతున్న వయసు బయటకు కనిపించకుండా దాచుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటంటే..
1. చికెన్ సూప్
చికెన్ సూప్ శ్వాసకోశ వ్యవస్థపై శోథ- నిరోధక ప్రభావం చూపి.. నొప్పి, మంట లాంటివి రాకుండా కాపాడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
2. పసుపు
పసుపు వృద్ధాప్య ఛాయలను దాచటమే కాక, సూర్యరశ్మి వలన చర్మానికి కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
3. ఎర్ర ద్రాక్ష
ఎర్ర ద్రాక్ష చర్మంలో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది, ఇది మంచి చర్మ రూపాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది.
4. నిమ్మకాయ
నిమ్మకాయలో ఉండే విటమిన్-సి, యాంటీ-ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడతాయి.
5. అల్లం
అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు వ్యాయామం తర్వాత వచ్చే కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
6. దానిమ్మ
దానిమ్మ చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటమే కాక.. చర్మం ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది.
7. జామపండు
రోజుకో జామపండు తింటే యవ్వనంగా కనిపించవచ్చు. ఇందులోని విటమిన్-సి మీ చర్మాన్ని యవ్వరంగా పదిలంగా ఉంచుతుంది.
8. చిలకడదుంప(స్వీట్ పొటాలో)
చిలకడదుంపలో బిటా-క్యారటోన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
9. కొబ్బరి నూనె
కొబ్బరినూనెలో విటమిన్- ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే కాక.. చర్మంలో వృద్ధాప్య ఛాయలు కనపడకుండా కాపాడుతుంది.
10. ఓట్స్
బియ్యం తినే వారి కన్నా ఓట్స్ తినే వారు చురుకుగా, యవ్వనంగా కనిపించనట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
11. కొత్తిమీర
విటమిన్లు ఎ, సి, కె సమృద్ధిగా ఉండే కొత్తిమీర.. శరీరంలో ద్రవం స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. తద్వారా చర్మం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
12. చెర్రీ జ్యూస్
చెర్రీ జ్యూస్ లో మెలటోనిన్ అనే పదార్ధం ఉంటుంది, ఇది నిద్ర సమస్యల్ని తగ్గించి ప్రశాంతంగా పడుకునేందుకు సహాయపడుతుంది. హాయిగా నిద్రపోతేనే కదా అందంగా కనిపించేది.
13. యాపిల్
ఈ పండులో పెక్టిన్ అనే ఆరోగ్యకరమైన ఫైబర్ ఉంటుంది, ఇది రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తోలుతో సహా తింటే మరింత మంచిది.
14. గ్రీన్ టీ
యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ.. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటమే కాక, ఒత్తిడి కారణంగా ఏర్పడే అస్థిర అణువుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది
వీటితో పాటు...యవ్వనంగా ఉండేందుకు మరికొన్ని ఆహారపదార్థాలు
15. చాకొలెట్ మిల్క్
16. వెన్న
17. ఉల్లిపాయలు
18. పాలకూర
19. బార్లే గింజలు
20. వైట్ బీన్స్
21. బ్లాక్ బీన్స్
22. పీనట్ బటర్
23. టమాటోలు
24. వాల్ నట్స్
25. బ్లూ బెర్రీస్
26. ఫ్లాక్స్ సీడ్
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు