బుధవారం 30 సెప్టెంబర్ 2020
Beauty-tips - Aug 09, 2020 , 19:42:57

జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్టండిలా..!

జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్టండిలా..!

హైద‌రాబాద్‌: వ‌ర్షాకాలంలో వాతావ‌ర‌ణంలో తేమ‌గా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ తేమ‌వ‌ల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డు చ‌ర్మం చాలా చికాకు క‌లిగిస్తుంది. ముఖంపై మొటిమ‌లు ఉన్న‌వాళ్లను ఈ స‌మ‌స్య మ‌రింత వేదిస్తుంది. అయితే, కొన్ని చిన్న‌చిన్న చిట్కాలు పాటించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌కు సులువుగా చెక్ పెట్టవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో చూద్దామా..?

తేనె, చ‌క్కెర మిశ్ర‌మం

  • తేనె, చ‌క్కెర‌ల‌ను స‌మానంగా తీసుకుని క‌లుపాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని మృదువుగా మ‌ర్ధ‌న చేయాలి. ఒక 15 నిమిషాల త‌ర్వాత ముఖాన్ని గోరువెచ్చ‌టి నీటితో క‌డుక్కోవాలి. ఇలా చేయ‌డంవ‌ల్ల ముఖంపై మురికి తొల‌గిపోతుంది. చ‌ర్మ రంధ్రాలు శుభ్ర‌ప‌డి జిడ్డు స‌మ‌స్య తీరుతుంది. 

ముల్తానీ మ‌ట్టి

  • ఒక చెంచా ముల్తానీ మ‌ట్టిలో రెండు చెంచాల నీళ్లు క‌లుపాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని అరగంట త‌ర్వాత క‌డిగేయాలి. నిత్యం ఇలా చేయ‌డంవ‌ల్ల చ‌ర్మంపై ఉన్న మురికి, జిడ్డు తొల‌గిపోవ‌డ‌మే కాకుండా చ‌ర్మం మిల‌మిలా మెరుస్తుంది. 

సెన‌గ‌పిండి, నిమ్మ‌ర‌సం, పెరుగు

  • మూడు చెంచాల సెన‌గ‌పిండిలో ఒక చెంచా నిమ్మ‌ర‌సం, స‌రిప‌డినంత‌ పెరుగు వేసుకుని పూత‌లా త‌యారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట త‌ర్వాత క‌డిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయ‌డం ద్వారా జిడ్డు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.  

   


logo