బుధవారం 27 జనవరి 2021
Beauty-tips - Dec 16, 2020 , 00:32:23

దోస నూనెతో మెరుపు

దోస నూనెతో మెరుపు

సౌందర్య పోషణలో కీర దోస మాత్రమే కాదు.. ‘దోస నూనె’ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. 

చర్మ సౌందర్యానికి..

  • చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోస గింజల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. వాపు నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ నూనెతో, చర్మంపై మసాజ్‌ చేస్తే ముడుతలతోపాటు వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. ఇందులోని విటమిన్‌-ఇ, వృద్ధాప్య లక్షణాలకు కారణమయ్యే రసాయనాలను నియంత్రిస్తుంది. 

జుట్టు పెరుగుదలకు..

  • దోస గింజల నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులోని సిలికా, కొత్త జుట్టు పెరగడంలో సాయం చేస్తుంది. జుట్టును బలపర్చడంతోపాటు వెంట్రుకలు రాలడాన్ని కూడా నిరోధిస్తుంది. 
  • ఈ నూనెతో గోళ్లను బాగా రుద్దితే దృఢంగా మారి, అందంగా కనిపిస్తాయి.


logo