శనివారం 23 జనవరి 2021
Beauty-tips - Nov 24, 2020 , 00:16:06

మెరిసే చర్మానికి..

మెరిసే చర్మానికి..

చలికాలం చర్మానికి శత్రువు. చల్లగాలికి చర్మమంతా పొడిబారి చికాకు పెడుతుంది. తేమతో కూడిన చల్లగాలి చర్మంలోని నీటిని తొలగిస్తుంది. దాంతో రంగుమారి కళావిహీనం అవుతుంది. ఇలాంటప్పుడు ఫేస్‌ప్యాక్‌లు చర్మానికి నిగారింపు తీసుకొస్తాయి. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ ఫేస్‌ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. 

ఆకుపచ్చని ప్యాక్‌ 

కొన్ని బచ్చలి ఆకులను ముద్దగా చేసుకోవాలి. దీనికి కొంచెం పసుపు, ఒక టేబుల్‌ స్పూన్‌ పుల్లని పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి.. మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నుంచి 25 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. 

పొటాటో ప్యాక్‌

ఒక టేబుల్‌ స్పూన్‌ పుల్లని పెరుగు, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలుగడ్డ రసం, ఒక టీస్పూన్‌ తేనెకు కొంత పసుపు కలపాలి. దీన్ని 20 నుంచి 25 నిమిషాల పాటు ముఖానికి ఉంచుకుని, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

నూనెల మాస్క్‌ 

తేనె, గ్లిజరిన్‌ ఒక్కో టేబుల్‌ స్పూన్‌ తీసుకుని..  కొన్ని చుక్కల నల్ల నువ్వుల నూనె, ఆముదం నూనె, ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌, కొబ్బరి నూనె, బాదం నూనె కలపాలి. ఈ నూనెల మిశ్రమాన్ని ముఖమంతా అప్లయి చేయాలి. 30 నిమిషాలయ్యాక ఫేస్‌ వైప్‌తో తొలగించాలి.

 పండ్ల మాస్క్‌

బొప్పాయి పండు గుజ్జుకు పాలు, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.


logo