మసూర్ పప్పుతో ఫేస్ ప్యాక్‌లు.. మంచి ఫలితాలు ఖాయం!

హైదరాబాద్ : మసూర్ పప్పు.. దీన్ని వాడుక భాషలో మైసూర్ పప్పు, ఎర్రకంది పప్పు అని కూడా పిలుస్తారు. పప్పు దినుసుల్లో చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి ఇవి తినడం ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో ఒకటి అని అందరికీ తెలిసిందే. మసూర్ పప్పు విషయానికొస్తే.. ఇది ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటుంది. అయితే ఈ పప్పును కేవలం ఆహారం రూపంలోనే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిచేలా రకరకాల ఫేస్ ప్యాక్ లా కూడా తయారు చేసుకోవచ్చట. తద్వారా పప్పును తినే అవసరం లేకుండానే నేరుగా చర్మానికి పోషకాలు, ఖనిజాలు అంది ప్రయోజనం చేకూరుస్తాయి. మసూర్ పప్పు మీ చర్మాన్ని శుభ్రపరిచి.., పోషకాహారాన్ని అందించే సహజమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఎలాంటి ఫేస్ మాస్కులు తయారు చేసుకోవచ్చో చూద్దామా..
1. ఎక్స్ఫోలియేషన్ మాస్క్
మసూర్ పప్పును ఉపయోగించటానికి సులభమైన మార్గం ప్రామాణిక పప్పును రుబ్బి.. దీంట్లో కొన్ని పాలు కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి స్క్రబ్ లాగా పూయండి. ఇది ఆరే వరకూ కుర్చుని పూర్తిగా ప్యాక్ ఎండిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి, మృతకణాలు, కాలుష్య కారకాలను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. సహజ మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. మీరు ఈ ప్యాక్‌ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం మచ్చ లేకుండా ఉంటుంది.
2. చర్మాన్ని బిగించే మాస్క్
చర్మం వదులుగా మారి వయసు ముదిరినట్టు కనపడకుండా ఉండాలంటే మీకు ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకు మీరు మసూర్ పప్పు పిండిలో గుడ్డు తెలసొన జోడించండి. ఇది చర్మానికి సహజమైన రక్తస్రావ నివారిణి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే చర్మంపైన ఉన్న రంధ్రాలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతోపాటు.. గుడ్డులోని ప్రోటీన్, అల్యూమినియం చర్మాన్ని టోన్ చేస్తుంది, ముడతలను కూడా తగ్గిస్తుంది.
3. తేమ కలిగించే మాస్క్
చర్మం పొడిబారి తయారైనప్పుడు.. దానికి అదనపు తేమ అవసరం. కాబట్టి మసూర్ పప్పును రుబ్బి దాంట్లోకి కొన్ని చుక్కల వెనిగర్, నీటిని, తేనెను కలపండి. మసూర్ దాల్ ప్యాక్ చర్మానికి చక్కటి తేమను అందిస్తుంది. వినిగర్ స్థానంలో నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్యాక్ తరచూ వేసుకోవడం వల్ల చర్మాన్ని పొడిబారుట, నిర్జీవ స్థితి నుంచి కాపాడుతుంది.
తాజావార్తలు
- బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగిస్తే రూ. 1000 జరిమానా
- అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!