శుక్రవారం 30 అక్టోబర్ 2020
Beauty-tips - Sep 26, 2020 , 18:08:19

ఇవి తింటే అందంగా క‌నిపిస్తారు! అంతేకాదు క్యాన్స‌ర్‌ని కూడా..

ఇవి తింటే అందంగా క‌నిపిస్తారు! అంతేకాదు క్యాన్స‌ర్‌ని కూడా..

అందం అంటే ఇష్ట‌ముండ‌ని వారుండ‌దు. అమ్మాయిలు, అబ్బాయిలు అందంగా క‌నిపించ‌డానికి ఎన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు. అంద‌రిలో మెరిసిపోవాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. అందుకోసం సంపాదించిన డ‌బ్బును పార్ల‌ర్‌, సెలూన్ల‌కు అప్ప‌చెబుతుంటారు. అయినా ఫ‌లితం ఉండ‌దు. కొంత‌మందికి ఏం చేయాలో తెలియ‌క‌ రెండు పూటల స్నానం చేసి అందంగా రాలేదే.. అని బాధ‌ప‌డుతుంటారు. అలాంటివాళ్లంద‌రి ఒక చిన్న‌ చిట్కా. దీన్ని ఫాలో అయితే చాలు. స్కిన్ టోన్ మెరుగుప‌డుతుంది.

అదేంటంటే.. రోజువారి ఆహారంలో క్యారెట్‌, ఆలూ, ఆకుకూర‌లు, ట‌మాటాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. ఇందులో అధిక సంఖ్య‌లో కెరోట‌నాయిడ్స్ ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు సూచించారు. ఈ కూర‌గాయ‌లు తిన‌డం వ‌ల్ల అందం మాత్ర‌మే కాదు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. 42 శాతం రోగాల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. ప్ర‌తిరోజూ వీటిని తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి మ‌హ‌మ్మారిని కూడా ద‌రిచేర‌నివ్వ‌దు అని నిపుణులు చెబుతున్నారు.