సోమవారం 03 ఆగస్టు 2020
Beauty-tips - Jul 06, 2020 , 18:03:49

ఆలూతో.. అంద‌మైన చ‌ర్మం మీ సొంతం!

ఆలూతో.. అంద‌మైన చ‌ర్మం మీ సొంతం!

కాలేజీలు, ఆఫీసులు ఉన్న‌ప్పుడు టైం లేక‌పోయినా అందంగా క‌నిపించేందుకు తెగ ఆరాడ‌ప‌తుంటారు మ‌గువ‌లు. బిజీగా ఉన్న‌ప్పుడు ఎంత ట్రై చేస్తే ఏం ప్ర‌యోజ‌నం. ఇప్పుడు లాక్‌డౌన్‌లో అంద‌రూ ఖాళీగానే ఉన్నారు క‌దా! ఇప్పుడు వేసుకోండి ఫేస్ ప్యాక్‌లు. కాలేజ్‌లు తెరిచే స‌రికి మీ అందం చూసి మీ ఫ్రెండ్స్ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవాలి. అలా అవ్వాలి అంటే ఆలూ.. ఉండాల్సిందే!

* క‌ళ్ల‌కింద మ‌చ్చ‌లు బాగా వేధిస్తున్నాయా అయితే ఆలూని గుండ్రంగా స్లైసులుగా క‌ట్ చేసుకోవాలి. వాటిని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. త‌ర్వాత తీసి క‌ళ్ల కింద పెట్టుకోవాలి. ప్ర‌తిరోజూ ఇలా చేస్తే న‌చ్చ‌మ‌చ్చ‌లు ర‌మ్మ‌న్నా రావు.

* ఆలూని మిక్సీ ప‌ట్టించి మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకొని అర‌గంట త‌ర్వాత క‌డిగేసుకుంటే చాలు ముఖం అందంగా మృదువుగా త‌యార‌వుతుంది. చ‌ర్మంపైనున్న జిడ్డు కూడా తొలిగిపోయి తాజాగా త‌యార‌వుతుంది. అంతేకాదు చ‌ర్మం రంగు కూడా చేంజ్ అవుతుంది.

* ఆలూ ర‌సంలో కొంచెం ముల్తానీ మ‌ట్టి క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకొని ఆర‌బెట్టుకోవాలి. ఆరిన త‌ర్వ‌త గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. 

* ఆలూని ఉడికించి మెత్త‌ని ముద్ద‌లా చేయాలి. అందులో పాల‌పొడి, బాదం నూనె క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి. పావుగంట త‌ర్వాత శుభ్రం చేసుకుంటే ఛాయ మెరుగుప‌డుతుంది.  

* ఆలూ ర‌సం, కోడిగుడ్డు తెల్ల సొన‌, పెరుగు వేసి బాగా క‌లుపుకోవాలి. ఆ త‌ర్వాత జుట్టు క‌దుళ్ల నుంచి మొత్తం వెంట్రుక‌ల‌కు అప్లై చేయాలి. 20 నిమిషాల త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేస్తే జుట్టు దృఢంగా త‌యార‌వుతుంది. అంతేకాదు జుట్టు రాలే స‌మ‌స్య కూడా త‌గ్గిపోతుంది.  

 

 


logo