శనివారం 30 మే 2020
Beauty-tips - Apr 08, 2020 , 20:33:40

తొక్కే క‌దాని పారేస్తున్నారా?

తొక్కే క‌దాని పారేస్తున్నారా?

ఆరెంజ్ లు తింటాం. తొక్క‌ని పారేస్తాం. కానీ వాటితో చ‌ర్మాన్ని మెరిసేలా చేయ‌వ‌చ్చు. అదెలాగంటే.. స్నానం చేసేట‌ప్పుడు సంత్ర పండు తొక్క‌ల‌తో చ‌ర్మంపై రుద్దుకుంటే చ‌ర్మం కాంతివంత‌మవుతుంది. చ‌ర్మంపై ఉన్న మృత‌క‌ణాలు తొలిగిపోతాయి.  ఎండిన ఆరెంజ్ తొక్క‌ల్ని టీలో వేసి, రెండు ల‌వంగాలు, కొద్దిగా అల్లం వేసి ఉడ‌క‌బెట్టి తాగితే ఆరెంజ్ గ్రీన్ టీ తాగినంత ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఆరెంజ్ తొక్కలు ఎండాక వాటిని పొడి చేసి టీ బ్యాగుల్లో వేసి ఇంట్లోని టేబుల్ డ్రాయర్లు, సొరుగులు, క్లోసెట్స్, బేస్‌మెంట్స్, ర్యాక్స్ ఇలా చాలా చోట్ల పెట్టుకోవచ్చు. ఇవి సువాసనను వెదజల్లుతాయి. 


logo