శనివారం 06 జూన్ 2020
Beauty-tips - May 06, 2020 , 19:36:57

గ్రీన్‌ టీ తో బరువు తగ్గొచ్చా..?

గ్రీన్‌ టీ తో బరువు తగ్గొచ్చా..?

హైదరాబాద్‌: మనిషి బరువు తగ్గడానికి గ్రీన్‌ టీ దోహదపడుతుందా.. లేదా? అనే దానిపై కొన్ని దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బరువు తగ్గడానికి చేసే కొన్ని కసరత్తులతోపాటు గ్రీన్‌ టీ తీసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనం నిరూపించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ఇటీవల ఫైటోథెరపీ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. రెగ్యులర్‌గా గ్రీన్‌ తీసుకునే వారి బరువుతోపాటు, వారి బాడీ మాస్‌ ఇండెక్స్‌లో కూడా కచ్చితమైన తగ్గుదల కనిపించినట్లు పరిశోధకులు  తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. అయితే, మొత్తానికి మనిషి బరువు తగ్గుతున్నప్పటికీ నడుము సైజుగానీ, పొట్ట కింద భాగంలోని కొవ్వుగానీ తగ్గడంలేదని తెలిపారు. కాగా, గ్రీన్‌ టీ తీసుకునే వారి బరువులో తగ్గుదల 12 వారాల తర్వాత నుంచి కనిపిస్తుందని పేర్కొన్నారు. మొత్తం 1344 మందిని 26 దఫాలు పరిశీలించి తాజా నివేదిక రూపొందించినట్లు రిసెర్చర్స్‌ వెల్లడించారు.


logo