గురువారం 03 డిసెంబర్ 2020
Beauty-tips - Nov 21, 2020 , 17:03:38

నిజంగా హెయిర్ ఆయిల్ జుట్టు రాలకుండా కాపాడుతుందా!

నిజంగా హెయిర్ ఆయిల్ జుట్టు రాలకుండా కాపాడుతుందా!

ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా.. ఎంత స్టైల్ గా రెడీ అయినా హెయిర్ లేకపోతే అదంతా వేస్టే అనిపిస్తుంది. ఎందుకంటే మనం అందంగా కనిపించాలంటే మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది మన హెయిర్. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటాం. 

అయితే ఎంత కాపాడుకున్నా జుట్టు రాలడం అనేది అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోక తప్పదు. ఈ రోజుల్లో అయితే వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ సమస్య నుంచి బయట పడటానికి కొందరు వేలకు వేలు పోసి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇంకొందరు  రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూస్ వాడుతుంటారు. ఇంట్లో ఉండే పదార్థాలతో ఏవో చిట్కాలు కూడా పాటిస్తుంటారు.

ఇక చాలా మంది జుట్టు రాలకూండా కాపాడుకోవడం కోసం తరచూ చేసే పని తలకు నూనె రాసుకోవడం. ఎందుకంటే తలకు కొబ్బరి నూనె బాగా పట్టించి, మసాజ్ చేసుకుంటే హాయిగా ఉండటమే కాక, వెంట్రుకలు బాగా పెరుగుతాయని గట్టి నమ్మకం. అంతేకాదు కొబ్బరినూనె తరచూ రాసుకోవడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుందని.. కొన్నేళ్లుగా ఆ పద్ధతిని పాటిస్తుంటాం. 

మరి నిజంగానే హెయిర్ ఆయిల్స్ జుట్టు రాళకుండా కాపాడతాయా. లేక మనం ఉట్టి భ్రమలో బతుకుతున్నామా అంటే... అవుననే అంటున్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్. జయ శ్రీ శరద్. 

 నిజానికి కొబ్బరినూనె గానీ.. వేరే ఇతర హెయిల్ ఆయిల్స్ కానీ తలకు కండీషనర్ లాగా మాత్రమే పనిచేస్తాయి. అవి మన జుట్టు పెరగుదలకు సహాయపడవు. అంతేకాదు.. తలకు బాగా నూనె పట్టించి మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి హాయిగా అనిపిస్తుంది. అంతేకానీ.. అది జుట్టు మొదళ్లకి బలాన్నిచ్చి హెయిర్ ఫాల్ ను ఆపలేదు అని ఆమె తెలిపారు. 

మరో విషయం ఏంటంటే..  మనిషకి హెయిర్ ఫాల్ అనేది వాతావరణ మార్పు వల్ల కాదట. మన జుట్టు ఎదుగుదల అనేది మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందట. కాబట్టి హెయిర్ ఫాల్ అవకుండా ఉండేందుకు మనం దానికి తగిన ఆహారం తీసుకుంటే సరిపోతుందని జయశ్రీ శరద్ చెబుతున్నారు.