గురువారం 03 డిసెంబర్ 2020
Beauty-tips - Nov 21, 2020 , 20:04:42

వయసు దాచుకోవాలని ఉందా.. ఇలా చేయండి!

వయసు దాచుకోవాలని ఉందా.. ఇలా చేయండి!

హైద‌రాబాద్ : రోజురోజుకీ పెరుగుతున్న వయసును ఎవరికి కనపడకుండా దాచుకోవాలని చూస్తున్నారా? అందరిలోనూ ప్రత్యేకంగా అందంగా కనిపించాలని ఉందా? కానీ కళ్ల కింత నల్లటి వలయాలు, మోహంపై వచ్చే ముడతలు మిమల్ని నిరాశ పరుస్తున్నాయి కదా..! వీటిని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండట్లేదని బాధపడుతున్నారా. అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు.

మన వయసు కనపడకుండా ఉండాలంటే ముఖ్యంగా మన చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్కిన్ హెల్తీగా ఉన్నప్పుడే ముడతలు రాకుండా ఉంటాయి. ముఖంపై ముడతలు, గీతలు రాకుండా ఉండాలంటే కొన్ని బ్యూటీ సీక్రెట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గీతిక మాటల్లో తెలుసుకుందాం..

1. చర్మం ఎలాంటిదో!

వయసు దాచుకోవాలంటే ముందుగా మనం చేయాల్సిన పని మన చర్మం ఎలాంటిదో తెలుసుకోవడం. కాబట్టి మీకు దగ్గర్లో ఉండే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి మీది జిడ్డు చర్మమో, పొడి చర్మమో లేక మామూలు రకమో అనేది తెలుసుకొండి.

2. తగిన ప్రొడక్ట్స్ తీసుకొండి

మీ చర్మం ఎలాంటిదో తెలుసుకున్నాక.. తగిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనుకుని రండి.

3. సన్ స్క్రీన్ లోషన్ మార్చకండి

మన చర్మానికి తగినట్టుగా సన్ స్క్రీన్ లోషన్ తీసుకొండి. ఎప్పుడూ  అదే వాడండి. బయటకు వెళ్లిన ప్రతిసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటూ ఉండండి. అది చలికాలమైనా.. ఎండాకాలం అయినా తప్పక రాసుకోండి.

4. మేకప్ మంచిది కాదు

అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే.. పడుకునే ముందు అస్సలు మేకప్ ఉంచుకోకూడదు. మీరు ఎంత అలసిపోయినప్పటికీ.. రాత్రుళ్లు నిద్రపోయే ముందు మేకప్ తప్పకుండా తీసేయాలి. అంతేకాదు మేకప్ తీసేయటానికి ఫేస్ వైప్స్ వాడకుండా ఉంటే మంచిది. 

5. మంచి నిద్ర అవసరం

మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా ముఖ్యమైనది నిద్ర. రాత్రంతా హాయిగా నిద్రపోతేనే.. మన చర్మం బాగుంటుంది. మన శరీరం అలసిపోయి ఉన్నప్పటికీ మన చర్మం మాత్రం రాత్రంతా మన రాసుకునే క్రీమ్స్ ను బాగా  అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫలితంగా ఉదయాన్నే లేచేసరికి కాంతివంతగా తయారవుతుంది. 

6. నీళ్లతో అందం ఫుళ్లు

నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. ఎక్కువ నీరు తాగడం వల్ల మన శరీరంలో చల్లదనం పెరిగి వయసు కనపడకుండా ఉంటుంది. నీరు చర్మంలోని జిడ్డును పొగొట్టి మెరిసేలా చేస్తుంది.

7. తీపికి దూరంగా ఉంటే మేలు

మనం ఎక్కువ వయసు ఉన్నట్లుగా కనిపించడానికి ముఖ్యకారణం మన ఒంట్లో ఉండే షుగర్. కాబట్టి మనం తినే ఆహారంలో తీపి తక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది. అంతేకాదు.. ధూమపానం వల్ల కూడా వయసుకు మించి కనిపిస్తామట.

8. న్యుట్రిషనల్ డైట్ తప్పదు

కొన్ని కావాలంటే కొన్నిటికి దూరంగా ఉండాలంటారు కదా. సరిగ్గా అలానే మనం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఇష్టమైన చాలా వాటికి దూరంగా ఉండాలి. మనం తినే ఆహారంలో ఎక్కువ న్యూట్రియన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. బయట తిళ్లు, ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉంటేనే మంచిదని డెర్మటాలజిస్టు డా.గీతిక చెబుతున్నారు.