కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి

ఆధునిక జీవనశైలిలో నిత్యం ఫోన్లు, కంప్యూటర్లతోనే గడపుతున్నందునో లేక నిద్రలేమి కారణంగానో చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలు వస్తున్నాయి. ఇవి మనిషి అందానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. వీటిని తగ్గించేందుకు వివిధ రకాల క్రీములు రాసుకుంటూ, ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే ఏవోవో రాసుకుని ముఖాన్ని మరింత పాడు చేసుకునే కన్నా.. కొన్ని ఆహార పదార్థాలను మీ రోజువారీ ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల కళ్ల చూట్టూరా ఉన్న డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
1. టమాట
టమాటాల్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున రక్తనాళాలను కాపాడేందుకు ఇవి బాగా ఉపయెగపడతాయి. అంతేకాదు టమాటాలు తినడం వల్ల రక్త సరఫరా పెరిగి కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
2. కీరదోస
కీరదోసలో నీటిశాతం ఎక్కువగా ఉన్నందున ఇది శరీరంలో వేడిని తగ్గించి చలువ చేసేలా చేస్తుంది. ఫలితంగా చర్మ సమస్యలు రాకుండా ఉండటమే కాక.. కాంతివంతంగా మారుస్తుంది.
3. పుచ్చకాయ
రోజూ పుచ్చకాయ తినడం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నవారు వీటిని తినడం వల్ల అవి త్వరగా తగ్గుముఖం పడుతాయి.
4. నల్ల ద్రాక్ష
నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఒమెగా-3లాంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
5. విటమిన్-ఈ
విటమిన్-ఈ ఎక్కువగా లభించే బాదం, పీనట్స్, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు తినడం వల్ల నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.
6. ఆకుకూరలు
మీరు తినే ఆహారంలో ఏదో ఒక రకంగా చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగవడమే కాక, కళ్ల చుట్టూరా ఉండే నలుపుతో పాటు, కళ్లు అలసిపోకుండా ఉంటాయి.
7. నారింజ
నారింజ తినడం వల్ల కొలాజెన్ శాతం పెరుగుతుంది. అలాగే నారింజలో విటమిన్-సి, విటమిన్-ఎ లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేయడంతో పాటు నల్లటి వలయాలకు అడ్డుకట్ట వేస్తాయి.
8. బీట్ రూట్
బీట్ రూట్ లోని బెటాలిన్ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్సిఫై చేసి కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు బాగా సహాయపడతాయి. అలాగే కళ్ల కింద నల్లటి వలయాల సమస్యను తగ్గించే లక్షణాలు బీట్ రూట్ లో లభిస్తాయి.
9. బొప్పాయి
బొప్పాయిలో సహజంగా లభించే బ్లీచింగ్ ఎజెంట్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడమే కాక.. చర్మాన్ని శుభ్రంగా కాంతివంతంగా మార్చేందుకు సహాయపడుతుంది.
10. నీళ్లు
నీళ్లు ఎంత తాగితే అంత మంచిది అని మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. పుష్కలంగా నీరు తాగడం వల్ల కళ్లు అలసి పోకుండా ఉండటమే కాక, కళ్ల కింద వచ్చే నల్లటి వలయాల సమస్య దరిచేరకుండా ఉంటుంది.
తాజావార్తలు
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!
- రాజన్న హుండీ ఆదాయం రూ. 40.56 లక్షలు
- నయనతార పెళ్లిపై క్రేజీ గాసిప్..!
- ఆడపిల్లకు సాదర స్వాగతం.. మురిసిన కుటుంబం