బుధవారం 30 సెప్టెంబర్ 2020
Beauty-tips - Aug 27, 2020 , 19:26:29

ప్ర‌తిరోజూ ముఖానికి ముల్తానీ మ‌ట్టి రాసుకుంటే ఏమ‌వుతుంది!

ప్ర‌తిరోజూ ముఖానికి ముల్తానీ మ‌ట్టి రాసుకుంటే ఏమ‌వుతుంది!

ముల్తానీ మ‌ట్టి ఏ సీజ‌న్‌లో అయినా బాగా ప‌నిచేస్తుంది. ఎలాంటి చ‌ర్మం క‌లిగిన వారికైనా ముల్తానీ ప‌డుతుంది. దీనివ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు. వ‌ర్షాకాలంలో చ‌ర్మం బాగా పొడిబారుతుంది. అలాంటి వారికి ముల్తానీ ప‌ర్‌ఫెక్ట్‌. మ‌రి ముల్తానీ మ‌ట్టి వాడ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌‌లుగుతాయో తెలుసుకోండి.

* ముల్తానీ మ‌ట్టి బ్ల‌డ్ స‌ర్క్యూలేష‌న్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో స్కిన్ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ముల్తానీమట్టిని స్క్రబ్‌గా వాడవ‌చ్చు.

* డార్క్ స‌ర్కిల్స్ ఎక్కువ‌గా వేధిస్తుంటే ముల్తానీ మ‌ట్టి బాగా ప‌నిచేస్తుంది. ముల్తానీ మ‌ట్టిలో నిమ్మరసం అలాగే పెరుగును కలిపి పేస్ట్ లా అప్లై చేసి డార్క్ సర్కిల్స్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి.

* ముల్తానీ మట్టిని ముఖానికి రోజూ వాడకూడదు. అతిగా వాడ‌డం వ‌ల్ల చ‌ర్మంలోని నేచురల్ మాయిశ్చరైజర్‌ను కోల్పోయేలా చేస్తుంది. స్కిన్ పొడిబారుతుంది. వారానికి రెండుసార్లు క‌న్నా ఎక్కువ‌గా వాడ‌కూడ‌దు.

* ముల్తానీ మ‌ట్టిని ఎక్కువ‌రోజులు స్టోర్ చేసి పెట్టుకోవ‌చ్చు. అయితే దీనిని ఎయిర్‌టైట్ కంటైన‌ర్‌లో స్టోర్ చేసుకుంటే మంచిది.  ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మ‌రింత మంచిది. మ‌ట్టిని కొనేట‌ప్పుడు అది స్వ‌చ్ఛ‌మైన‌దో కాదో చెక్ చేసుకొని తీసుకోవాలి.

* ముల్తానీ మట్టిని డైరెక్టుగా కాకుండా శాండ‌ల్ఉడ్  పౌడర్ లో కలిపి వాడితే ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్య తగ్గుతుంది. ఇందులో కొంచెం రోజ్ వాటర్‌ను కలిపి పేస్ట్‌లా తయారు చేసుకొని ముఖానికి రాసుకోవాలి.


logo