బుధవారం 27 మే 2020
Beauty-tips - Jan 22, 2020 ,

అందాన్ని రెట్టింపు చేసుకోండిలా!

అందాన్ని రెట్టింపు చేసుకోండిలా!

మార్కెట్లో దొరికే క్రీమ్స్‌ వాడి విసిగిపోయారా? బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగలేక అలసిపోయారా? ఇదుగో అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిని పాటించి ఇంటిపట్టునే అందాన్ని రెట్టింపు చేసుకోండి.

  • కొబ్బరి నూనెలో పసుపు కలిపి పేస్ట్‌లా చేసి శరీరానికి రాసి స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
  • ఆరెంజ్‌ను రెండుగా కట్‌ చేసి ముఖానికి మర్దన చేసి పదినిమిషాల తర్వాత  సబ్బుతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ముఖ సౌందర్యం రెట్టింపవుతుంది.
  • ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించాలంటే నిమ్మరసాన్ని ముఖంపై రాస్తుండాలి. రోజూ ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
  • ఒబెసిటీని దూరం చేసుకోవాలంటే రోజూ హాట్‌ వాటర్‌తో రెండు స్పూన్ల నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే సరి.
  • గోళ్లను కత్తిరించేందుకు నూనె రాసుకొని కాసేపయ్యాక కట్‌ చేస్తే గోళ్ల షేప్‌ బాగుంటుంది.
  • జుట్టు ఆయిలీగాఉంటే కోడిగుడ్డులోని తెల్లసొన, పంచదారను ప్యాక్‌లా వేసుకొని మాడుకు పట్టించి తలస్నానం చేయాలి.
  • టీ వడకట్టిన తర్వాత మిగిలిన తేయాకులో నిమ్మరసం చేర్చి తలకు పట్టిస్తే జుట్టు సాఫ్ట్‌గా తయారవుతుంది.
  • గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉప్పును కలిపి కంటిని శుభ్రం చేస్తే కంటికి ప్రత్యేక ఆకర్షణ లభిస్తుంది.


logo