శుక్రవారం 07 ఆగస్టు 2020
Beauty-tips - Feb 02, 2020 , 22:38:55

ఆయుర్వేదంలో సౌందర్యం

ఆయుర్వేదంలో సౌందర్యం

  • టీ స్పూన్‌ ఆపిల్‌ గుజ్జులో 5 చుక్కల తేనె కానీ పాలు కానీ కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్‌ మాస్క్‌లా వేసుకొని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి.
  • బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాయాలి. అరగంట తర్వాత కడిగితే ముడతలు తగ్గుతాయి. ముఖంపై నలుపు ఉన్నా తగ్గుతుంది. కనీసం వారంలో మూడుసార్లు ఫలితం వచ్చేదాకా చేయాలి.
  • చర్మం వదులుగా మారితే ముడతలు వస్తాయి. ముఖ్యంగా తక్కువ వయసులోనే చర్మంపై ముడతలు వస్తే ఆ బాధను తట్టుకోలేరు. అలాంటి వారు ముఖ చర్మాన్ని బిగుతుగా మార్చుకునేందుకు ఆలు రసం, తేనె, నిమ్మ రసం తగిన మోతాదులో కలిపి ముఖానికి రాయాలి. గంట తర్వాత కడిగేయాలి. ఇలా వారంలో రెండు రోజులు నాలుగు వారాలు చేస్తే ఫలితం ఉంటుంది.
  • పెదవులు ఒక్క చలికాలంలోనే పగలవు. కాలాతీతంగా తరచూ ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది. అతి వేడి కారణంగా పెదవులు పగులుతాయి. పొడిబారి పగిలిన పెదవులకు రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే సరి.
  • మోచేతులు, కాళ్లు గరుకుగా ఉంటే తగ్గించాలంటే.. రెండు బాగా మగ్గిన అరటి పండ్ల గుజ్జుగా ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో రెండు చెంచాల చక్కెర కలిపి మోచేతులకు, మోకాళ్లకు రాస్తే అవి నునుపుగా మారుతాయి.


logo