గురువారం 04 జూన్ 2020
Beauty-tips - Apr 25, 2020 , 17:21:29

తెల్ల‌మ‌చ్చ‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా?

తెల్ల‌మ‌చ్చ‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా?

నిగ‌నిగ‌లాడే చ‌ర్మం. దానిపై తెల్ల‌ని పూత‌. దీన్నే తెల్ల‌మ‌చ్చ‌లు లేదా బొల్లి అంటుంటారు. అయితే ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు శారీరకంగా, మాన‌సికంగా కుంగిపోతుంటారు. ఈ స‌మ‌స్య‌కు అవ‌గాహ‌నే స‌రైన ప‌రిష్కార‌మ‌ని చెబుతున్నారు వైద్యులు.

బొల్లిని వైద్య పరిభాషలో ల్యూకోడెర్మా గా పిలుస్తారు. శరీర ఛాయను నిర్దేశించే  చర్మ కణాల పనితీరును   జన్యు లోపాలు, మానసిక ఒత్తిడి, పలు ఇతర కారణాలు ప్రభావితం చేసి క్రమంగా ఆ భాగపు చర్మం తెల్లగా మారుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా పెదవులు, కనురెప్పలు, కనుబొమ్మలు, మాడు వంటి సున్నితమైన భాగాల్లో ఈ మచ్చలు వస్తాయి. ఈ భాగాల్లో ఉండే వెంట్రుకలు సైతం తెల్లగా మారతాయి. బొల్లి వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి హానీ ఉండ‌దు. కానీ  ఆత్మ‌న్యూన‌తా భావంతో బాధ‌ప‌డుతుంటారు.

శ‌రీరంపై మ‌చ్చ‌లు ఏర్ప‌డి ఎంత‌కాల‌మైంది? ప‌రిమాణం? ఏభాగంలో మ‌చ్చ‌లు ఉన్నాయి? బొల్లి తో బాధ‌ప‌డుతున్న వారి జీవ‌న శైలి త‌దిత‌ర అంశాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని వైద్యులు చికిత్స చేస్తుంటారు.  ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. బాధితులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరం లేదు. వీలున్నంత త్వరగా వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోగలిగితే కాస్త ఆలస్యంగానైనా ఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.


logo