మంగళవారం 14 జూలై 2020
Beauty-tips - Jun 19, 2020 , 19:45:29

ఇంట్లోనే ఉన్న‌ప్ప‌టికీ జుట్టు స‌మ‌స్య‌లు వ‌ద‌ల‌ట్లేదా? ఉల్లితో ఇలా చేయండి!

ఇంట్లోనే ఉన్న‌ప్ప‌టికీ జుట్టు స‌మ‌స్య‌లు వ‌ద‌ల‌ట్లేదా? ఉల్లితో ఇలా చేయండి!

వాతావ‌ర‌ణ కాలుష్యం ద్వారా జుట్టు స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉంటాయి. లాక్‌డౌన్‌లో ఇంటి ప‌ట్టునే ఉన్నాం క‌దా. కాలుష్యం బారి నుంచి త‌ప్పించుకున్నాం అనుకున్నా జుట్టు స‌మ‌స్య‌లు వ‌దిలిప‌ట్ట‌డం లేదు. జుట్టు చిట్లిపోవ‌డం, తెగిపోవ‌డం, చుండ్రు లాంటి స‌మ‌స్య‌ల‌ను ఉల్లిగ‌డ్డ‌తోనే ప‌రిష్క‌రించుకోవాలి అంటున్నారు వైద్యులు. 

* ఉల్లిగ‌డ్డ‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. దీన్ని మిక్సీ ప‌ట్టించాలి. త‌ర్వాత ఒక క్లాత్‌లో పెట్టి బాగా పిండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వ్య‌ర్థ ప‌దార్తం అంతా క్లాత్‌లోనే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిర‌సాన్నిజుట్టు కుదుళ్ల‌కు బాగా ప‌ట్టించాలి. గంట త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేస్తే స‌రిపోతుంది.

* ఉల్లిగ‌డ్డ‌లో బ్యాక్టీరియా, ఫంగస్‌లను తరిమికొట్టే గుణాలు చాలా ఉన్నాయి. జుట్టు ఊడిపోయేవారికి ఇది దివ్యౌషధంగా ప‌నిచేస్తుంది.

* ఎందుకంటే అవి జుట్టు కుదుళ్లను ఒత్తుగా, బలంగా అయ్యేలా చేస్తాయి. చుండ్రుకు చెక్ పెడతాయి.

* ఉల్లిలో ఉండే సల్ఫర్... జుట్టు చిట్లిపోవడాన్నీ, సన్నగా మార‌డాన్ని అడ్డుకుంటుంది. 

* జుట్టు రాలే స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న వారికి ఉల్లిగ‌డ్డ‌ అద్భుత ప్రయోజనాన్ని పొందగలరు. 

* జుట్టు తెల్లగా అయిపోతుంటే... వెంటనే ఉల్లిపాయల్ని ప్రయోగించడం మేలు. ఎందుకంటే వెంట్రుకల గొట్టాల్లో ఉండే మెలనిన్‌ను (ఈ మెలనిన్ లేకపోతే వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి) తిరిగి నింపడంలో ఉల్లిపాయలు ది బెస్ట్. 

* పేలు ఉంటే వాటిని వ‌దిలించ‌డానికి ఉల్లి చాలా మేలు చేస్తుంది. ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి. ఇది కూడా జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది.


logo