బుధవారం 03 జూన్ 2020
Beauty-tips - Mar 28, 2020 , 19:14:35

కైక‌లూరి క‌న్నెపిల్ల మ‌ళ్లీ వ‌చ్చేసింది..ఫోటోస్‌ వైరల్‌..

కైక‌లూరి క‌న్నెపిల్ల మ‌ళ్లీ వ‌చ్చేసింది..ఫోటోస్‌ వైరల్‌..

చిన్న‌నాటి మీనా.. ఆ త‌ర్వాత హీరోయిన్ మీనాని చూశాం. కానీ పెళ్ల‌యాక ద‌`శ్యంతో తెర‌పై మెరిసింది.  త‌ల్ల‌యిన త‌ర్వాత మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ముఖానికి రంగు వేసుకొని క‌నిపించ‌లేదు. ఇప్ప‌డు ఒక లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఇప్ప‌టి హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటి ఇస్తున్న‌ట్లు ఫోజులు కొడుతున్న‌ది. మీనా అంటే తెలుగు వాళ్ల‌కి ప్ర‌త్యేక అభిమానం. ముద్దుముద్దుగా ఉన్న మీనాని చూశాం. ఆ పై హీరోయిన్‌గా కొన్ని వంద‌ల సినిమాలు చేసింది. అగ్ర‌హీరోల అంద‌రి స‌ర‌స‌నా న‌టించింది. పెళ్ల‌యి, పాప పుట్టిన త‌ర్వాత ముఖానికి రంగు వేయ‌డం త‌గ్గించింది. పైగా కాస్త లావు అయింది కూడా. ఈ గ్యాప్ తీసుకోవ‌డానికి కార‌ణం ఇంత అందంగా త‌యార‌వ‌డానికేనేమో అన్న‌ట్లు ఉన్నాయి ఈ ఫొటోలు. హాట్‌హాట్‌గా ఒక మ్యాగ‌జైన్‌కి ఇచ్చిన ఫొటోలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. 


సరిపోయే స్లీవ్ లెస్ జాకెట్టుతో జత చేసిన మెరిసే ఎరుపు సీక్విన్ చీరలో మీనా అద్భుతంగా కనిపించింది. ఆమె స్టేట్మెంట్ పచ్చ పూసల హారము, పోల్కి స్ట‌డ్స్, రింగ్ తో యాక్సెసెరీస్ వేసుకొని సూప‌ర్‌గా క‌నిపిస్తున్న‌ది.  ఎరుపు పెదవులు, మృదువైన కర్ల్స్ లుక్‌ని పూర్తి చేశాయ‌న్న‌ట్లుగా ఉంది. తన రెండవ లుక్ కోసం, మీనా సాంప్రదాయ పసుపు ఎంబ్రాయిడరీ లెహంగా , నీలి బంధాని దుప్పట్టతో జత చేసిన జాకెట్టును ఎంచుకుంది. ఆమె జుట్టును వ‌దిలేయ‌కుండా ముడి వేసుకుంది. సంప్ర‌దాయంగా ఉంటూనే స్టైలిష్‌గా క‌నిపిస్తున్న‌ది. వ‌జ్రాల ఆభ‌ర‌ణాలు ఆమె లుక్‌ని మ‌రింత మార్పు చేశాయి.

మ్యాగజైన్ కవర్ షూట్ కోసం, మీనా లావెండర్ ప్యాంట్ చీరను ధరించింది, ఇందులో పల్లూ వెంట వైన్ కలర్ ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌తో జతచేయబడింది. ఒక స్టేట్మెంట్ స్టోన్ స్టడెడ్ నెక్లెస్ సెట్, బెల్ట్ బంగారు రంగు చెప్పులు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.logo