శనివారం 30 మే 2020
Beauty-tips - Apr 11, 2020 , 13:40:48

ముఖం మీద మొటిమలు బాధిస్తున్నాయా?

ముఖం మీద మొటిమలు బాధిస్తున్నాయా?

ముఖం మీద మొటిమలు, మచ్చలు స‌మ‌స్య‌గా మారాయా?  కొన్ని సమయాల్లో అవి ఆందోళన,  ఒత్తిడికి గురిచేస్తున్నాయా? అయితే ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వండి.

కలబంద జెల్‌తో సమస్యకు చెక్‌

కలబంద జెల్ గొప్ప వైద్యం లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కంగా ఉన్నాయి. తద్వారా  ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చర్మంపై మంటను తగ్గిస్తుంది. చర్మం చుట్టూ దుమ్ము, దూళి చేరకుండా నిరోధిస్తుంది. కలబంద జెల్‌ను రోజుకు రెండుసార్లు అప్లయ్‌ వల్ల స‌మ‌స్య‌ను అదిగ‌మించ‌వ‌చ్చు.

తేనేతో చర్మం మృదువుగా

తేనె చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇది దెబ్బతిన్న చర్మ కణాలను తొల‌గిస్తుంది. ప్రతిరోజూ ముఖానికి తేనె పూయడం వల్ల మొటిమలు మచ్చలను తగ్గించవచ్చు. తేనెకు చిటికెడు పసుపు జోడిస్తే ఫలితం బావుంటుంది.

టీట్రీ ఆయిల్

దీనిని మొటిమల మచ్చలపై పూయాలి. 20 నిమిషాల త‌ర్వాత క‌డిగేయాలి. దీంతో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడటానికి  సహాయపడుతుంది. 

గ్రీన్ టీ

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. వాడేసిన గ్రీన్ టీని ముఖంపై పెట్టి కాసేపు మ‌ర్దన చేయాలి. ఈ ప్రక్రియ చర్మంపై చికాకు కలిగించకుండా చూసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గుముఖం ప‌డుతాయి. ఇది వైరస్లు, అనేక సేంద్రీయ ఆమ్లాలకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది, తద్వారా మొటిమలతో పోరాడటానికి సహాయపడుతుంది.


logo