మంగళవారం 14 జూలై 2020
Beauty-tips - Jun 25, 2020 , 14:56:44

అర‌టిపండుతో ఇలా చేస్తే.. జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు!

అర‌టిపండుతో ఇలా చేస్తే.. జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు!

అర‌టిపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో అంద‌రికి తెలిసిందే. తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఇది శిరోజాల‌కు కూడా మంచి పోష‌ణ ఇస్తుంది. అర‌టిపండుతో ఫేస్ మాస్క్ వేసుకుంటారు అని కూడా తెలుసు. అదే అర‌టిపండుతో హెయిర్ మాస్క్ కూడా వేసుకోవ‌చ్చు. 

అర‌టిపండులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్‌, విట‌మిన్లు జుట్టును ప్ర‌కాశ‌వంతంగా చేస్తుంది. అరటిపండు తొక్క‌లో ఉండే యాంటీ మైక్రోబ‌య‌ల్ ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు, చుండ్రు నివార‌ణ‌కు కూడా ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతాయి. అయితే అర‌టిపండుతో ఎలా హెయిర్ మాస్క్ వేసుకోవాలో తెలుసుకోండి. 

* ముందుగా బాగా పండుమాగిన అర‌టిపండ్ల‌ను తీసుకొని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. అలాగే స‌గం ముక్క బొప్పాయిని కూడా క‌ట్ చేసుకోవాలి.

* ఈ ముక్క‌ల్లో కాస్త తేనె క‌లిపి పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. 

* ఇప్పుడు అర‌టిపండు, ప‌ప్పాయి మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టేలా బాగా అప్లై చేయాలి. 

* త‌ర్వాత ష‌వ‌ర్ క్యాప్ లేదా క‌వ‌ర్‌ను త‌ల‌కు పెట్టుకొని అరగంట‌పాటు ఆర‌నివ్వాలి.

* జుట్టు బాగా ఆరిన త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

* త‌ర‌చూ ఇలా చేస్తుంటే.. జుట్టు దృఢంగా మిల‌మిలా మెరుస్తుంటుంది. 


logo