బుధవారం 27 జనవరి 2021
Beauty-tips - Jan 04, 2021 , 07:01:29

కురులకు గుంటగలగర

కురులకు గుంటగలగర

జుట్టు రాలడం.. వెంట్రుకలు తెల్లబడటం, దురద, చుండ్రు వంటి సమస్యలు వచ్చినప్పుడు.. ఒక్కోదానికి ఒక్కో పరిష్కారం వెతుక్కోవాల్సిన పనిలేదు. మన అమ్మమ్మ, నానమ్మలు వాడిన చిట్కాలను పాటిస్తే చాలు. ముఖ్యంగా పొలం గట్ల మీద, ఇంటి వెనుక పెరట్లో పెరిగే గుంటగలగర ఆకుతో జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి. ఈమధ్య పట్టణాల్లోనూ కొందరు గుంటగలగర మొక్కలను కుండీల్లో పెంచుతున్నారు.

గుప్పెడు గుంటగలగర ఆకులను ఒక కప్పు కొబ్బరి

  • నూనెలో వేసి మరిగించాలి. ఆకులు నల్లగా మారాక నూనెను వడగట్టాలి. నూనె చల్లారాక ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ నూనెను వారానికి రెండుసార్లు మాడుకు, జుట్టుకు పట్టించి.. రెండు గంటల తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. దీంతో చండ్రు మాయమవుతుంది. కుదుళ్లు బలపడతాయి.
  • రాత్రి నిద్రపోయే ముందు జుట్టుకు ఈ నూనె రాసుకుని, తెల్లారి తలస్నానం చేస్తే మంచి గుణం కనిపిస్తుంది. గుంటగలగర ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరినూనెలో కొద్దిగా పొడి వేసి కూడా మరిగించుకోవచ్చు.
  • తాజా గుంటగలగర ఆకులను ముద్దగా నూరి, దాంతో హెయిర్‌ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. కావాలంటే అందులో కొద్దిగా పెరుగు లేదా గుడ్డు తెల్లసొన కలుపుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా గుంటగలగరను  ఎలా వాడినా.. జుట్టు సమస్యలన్నీ పోయి పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతమవుతుంది.


logo