శుక్రవారం 22 జనవరి 2021
Beauty-tips - Dec 25, 2020 , 01:39:32

రోజ్‌.. రోజ్‌ రోజా పువ్వా!

రోజ్‌.. రోజ్‌ రోజా పువ్వా!

చర్మాన్ని మృదువుగా మార్చుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటాం. ముఖారవిందం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాం. అవేవీ లేకుండా, సహజ సౌందర్యాన్ని ఇలా సొంతం చేసుకోవచ్చు..

సహజ సిద్ధమైన పదార్థాల ద్వారా చలికాలంలో సహజ సిద్ధమైన అందాన్ని పొందాలంటే.. ఇంట్లో లభించే పదార్థాలు చాలని అంటున్నారు కాస్మొటిక్‌ ఇంజినీర్‌ డాలీ కుమార్‌. ఆయన అభిప్రాయం ప్రకారం.. రోజ్‌, పాలు చర్మానికి, చర్మ సౌందర్యానికి మేలు చేస్తాయి. రోజ్‌లో విటమిన్లు, ఫాటీ ఆమ్లాలు, మినరల్స్‌ ఉంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్‌ గుణాన్ని కూడా కలిగి ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. పాల మీగడతో చర్మంపై మసాజ్‌ చేస్తే కొత్త నిగారింపును సొంతం చేసుకోవచ్చు. 


logo