సోమవారం 18 జనవరి 2021
Beauty-tips - Dec 06, 2020 , 00:06:49

దురద మాయం

దురద మాయం

  • జుట్టుకు సంబంధించి.. ఎక్కువగా కనిపించే సమస్య.. మాడు దురద పెట్టడం. దీనికి చుండ్రు, మాడు పొడిబారడం వంటి ఎన్నో కారణాలుంటాయి. ఈ చిట్కాలను పాటించి, దురద సమస్య నుంచి తప్పించుకోండి.  
  • రెండు టీ స్పూన్ల పెరుగులో ఒక టీ స్పూన్‌ నిమ్మరసం వేసి కలపాలి. దాన్ని మాడు, జుట్టుకు పట్టించాలి. ఇరవై నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
  •  ఐదారు మందార పూలు, నాలుగు ఆకులను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు టీ స్పూన్ల పెరుగు, కొద్దిగా నిమ్మరసం కలపాలి. దాన్ని మాడుకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేయాలి.