బుధవారం 30 సెప్టెంబర్ 2020
Beauty-tips - Sep 03, 2020 , 02:58:40

నల్లబడుతున్నా.. ఏం చేయాలి?

నల్లబడుతున్నా.. ఏం చేయాలి?

  నేను ఇంతకు ముందు తెల్లగానే ఉండేదాన్ని. రెండేండ్ల క్రితం మా వారికి చెన్నై ట్రాన్స్‌ఫర్‌ అయింది. ఈ రెండేండ్లలో బాగా నల్లబడ్డాను. నీటి మార్పు వల్ల నల్లగా అవుతారా? నా నలుపుదనం తగ్గడానికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా? 

- సునీత, చెన్నై

మీరు ఇంతకు ముందు తెల్లగా ఉండి, ఇప్పుడు చెన్నై వెళ్లిన తరువాత నల్లబడ్డారని చెప్తున్నారు. సాధారణంగా చాలామంది వాతావరణ మార్పుల వల్ల రంగు నల్లబడుతున్నా.. ఏం చేయాలి? 

మారుతుంటారు. కొంతమంది ఏ హాలీడే టూర్‌కో వెళ్లి వచ్చిన తరువాత కూడా ఇలా చర్మం నల్లబడటం, సన్‌ బర్న్‌, ట్యాన్‌ అవుతున్నదంటారు. చెన్నైలో వాతావరణం వేడిగా ఉంటుంది. దానివల్ల మీ చర్మం నల్లబడే అవకాశం ఉంది. జీవ నశైలిలోనే కొద్ది మార్పులు చేసుకోవాలి. మీరు ముందు సన్‌స్క్రీన్‌ రాసుకోవడం అలవాటు చేసుకోండి. డీపిగ్మెంటింగ్‌ క్రీములు కూడా వాడవచ్చు. ైగ్లెకోసిలిక్‌ యాసిడ్‌, ఆర్బిటిన్‌, కోజిక్‌ యాసిడ్‌ , లికోరైట్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ వంటి కాంబినేషన్స్‌ ఉండే క్రీమ్స్‌ ఇందుకు ఉపయోగపడుతాయి. మీ చర్మం రకాన్ని బట్టి అంటే జిడ్డు చర్మమా, డ్రై స్కిన్‌ లేదా కాంబినేషనా, పింపుల్స్‌ వస్తాయా అనేదాన్ని బట్టి డీపిగ్మెంటింగ్‌ క్రీమ్స్‌ ఎంచుకోవాలి. సన్‌స్క్రీన్‌ వాడుతున్నా ఫలితం లేదంటే, అది తగిన  మోతాదులో వాడట్లేదని అర్థం. రోజుకి రెండుసార్లు రాసుకోవాలి. పొద్దున 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు రాసుకోవాలి. కనీసం 30 ఎస్‌పిఎఫ్‌ ఉండాలి. జెల్‌ బేస్డ్‌ సన్‌స్క్రీన్‌ అయితే జిడ్డుగా అనిపించదు. సన్‌స్క్రీన్‌ మీద టాల్కమ్‌ పౌడర్‌ కూడా వేసుకోవచ్చు. సాయంకాలం డీపిగ్మెంటింగ్‌ క్రీమ్‌ రాసుకోవాలి. ఆహారంలో విటమిన్‌ సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. టమాటాలు, బెర్రీలు, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా తీసుకుంటే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. విటమిన్‌ సి సీరమ్‌ బేస్డ్‌, గ్లూటథియోన్‌ సీరమ్స్‌ను సన్‌స్క్రీన్‌ పెట్టుకునేముందు బేస్‌ లాగా రాసుకోవచ్చు. అయినా ఫలితం లేదంటే కెమికల్‌ పిల్స్‌, లేజర్‌ టోనింగ్‌ లాంటి చికిత్సల వల్ల యాంటీ ఏజింగ్‌ ప్రభావాన్ని అధిగమించొచ్చు. డాక్టర్‌ని కలిస్తే మీ చర్మం రకాన్ని బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. 


డాక్టర్‌ స్వప్నప్రియ

కన్సల్టెంట్‌ సీనియర్‌ డెర్మటాలజిస్ట్‌

కేర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


logo