మంగళవారం 26 మే 2020
Beauty-tips - May 23, 2020 , 01:00:59

అందానికీ, ఆరోగ్యానికీ మేలు చేసే రామఫలం

అందానికీ, ఆరోగ్యానికీ మేలు చేసే రామఫలం

రామఫలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం ,జుట్టు సమస్యలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. రామఫలంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉండుట వలన సమస్యలను  పరిష్కరించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. రామ ఫలంలోని గుజ్జును 5 స్పూన్లు తీసుకుని, దానిలో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ తేనే కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానము చేస్తే తలలో దురద తగ్గుతుంది. రెండు స్పూన్ల రామఫలం గుజ్జులో రెండు స్పూన్ల పాలు, ఒక స్పూన్ అలోవెర జెల్, అరటీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలన మొటిమల సమస్య తగ్గిపోతుంది. రెండు స్పూన్ల రామఫలం గుజ్జులో ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్నిశుభ్రం చేస్తే ఫలితం కనిపిస్తుంది. 


logo