సోమవారం 25 మే 2020
Beauty-tips - Mar 21, 2020 , 22:34:29

నెయిల్‌ ఆర్ట్‌ కరోనా

 నెయిల్‌ ఆర్ట్‌ కరోనా

కొందరు డిజైనర్స్‌ తమ ైస్టెల్‌లో  కరోనా నెయిల్‌ఆర్ట్‌ వేస్తున్నారు. తద్వారా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వైరస్‌ రాకుండా ఉండాలంటే చేతులు శుభ్రం చేసుకోవాలి. నోట్లో చేతులు పెట్టుకోకూడదు అని తెలిసినా కొంతమంది టక్కున వేళ్లు పెట్టుకొని గోర్లు కొరుకుతుంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని ‘కోవిడ్‌-19 అనే పేరును, మాస్క్‌ ధరించిన యువతి, వైరస్‌లను నెయిల్‌ ఆర్ట్‌లుగా వేస్తున్నారు. వీటిని చూసినప్పుడైనా జాగ్రత్త వహిస్తారని చిన్న ఆశ. జాగ్రత్తల గురించి పక్కన పెడితే నెయిల్‌ ఆర్ట్‌ చాలా బాగుందని కొంతమంది నేరుగా డిజైనర్లను కలుస్తున్నారు. మరికొంతమంది  స్వయంగా ఆర్ట్‌ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.


logo