శనివారం 30 మే 2020
Beauty-tips - Mar 17, 2020 , 22:47:17

రెండు రకాలుగా వేసుకోవచ్చు

రెండు రకాలుగా వేసుకోవచ్చు

ఆడవాళ్లకు ఎన్ని నగలు ఉన్నా సరిపోవనిపిస్తుంది. ఒకసారి పెట్టినవి మళ్లీ పెట్టకుండా చూసుకోవాలనుకుంటారు. కానీ ఒకే నగ రెండు రకాలుగా ఉపయోగపడితే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? అదెలా సాధ్యం అవుతుందని కూడా అనిపించొచ్చు. కానీ కొన్నిసార్లు అవసరాలు మనల్ని ఏమైనా చేసేలా చేస్తాయని ఊరికే అనలేదు. మెడలో నగలు దిగేసి నడుముకు ఏమీ పెట్టకుండా వదిలేస్తే బోసి పోయినట్టు ఉంటుంది కదా! అప్పుడే ఎవరో మెడలో ఉన్న ఒక నగని తీసి నడుముకి చూట్టేసినట్టున్నారు. దాన్నే ఇప్పుడు మనవాళ్లు ఫాలో అయిపోతున్నారు. నగ కేవలం మెడకే ఎందుకు పరిమితం చేయాలని దాన్ని రెండు రకాలుగా ఉపయోగించేలా డిజైన్‌ చేస్తున్నారు. అటు వడ్డాణంగా.. ఇటు మెడలో ఒదిగిపోయే నగలాగా తయారుచేస్తున్నారు. మువ్వల హారాలు, కాసుల పేర్లను మాత్రం ఎక్కువగా ఇలా రెండు రకాలుగా ఉపయోగించేందుకు మగువలు మక్కువ చూపిస్తున్నారట. logo