శనివారం 30 మే 2020
Beauty-tips - Mar 15, 2020 , 22:38:48

అద్దాల సోయగాలు

అద్దాల సోయగాలు

పాత ఓ  రోత.. కొత్త ఒక వింత అంటుం టారు. కానీ ఫ్యాషన్‌లోకి వచ్చేసరికి పాత ఇప్పుడు మరింత కొత్తగానే మెరిసిపోతుంది. దీనికి నిదర్శనమే.. మిర్రర్‌ వర్క్‌ ట్రెండ్‌. బాలీవుడ్‌, టాలీవుడ్‌.. ఇలా అన్ని వుడ్‌లనే కాదు.. బయట కూడా ఊపు ఊపేస్తున్న ట్రెండ్‌.. మిర్రర్‌ వర్క్‌. కేవలం బార్డర్‌గానే ఒకప్పుడు వేసేవారు. అలాకాకుండా ఇప్పుడు డ్రెస్‌ మొత్తం ఈ వర్క్‌తో నింపేస్తున్నారు. ఇక్కడ చూడండి.. జాహ్నవి ఇదే ట్రెండ్‌ని ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు కొన్ని ఈవెంట్లలో వేసుకున్న ఆమె డ్రెస్‌లే చెబుతాయి. ఈ వర్క్‌ వచ్చిన డ్రెస్‌ వేసినప్పుడు పెద్దగా నగలు అవసరం లేదు. కేవలం చెవుల కమ్మలను హైలైట్‌ చేస్తే లుక్‌ అదిరిపోతుందని ఫ్యాషనిస్టులు చెబుతున్నారు. 


logo