శనివారం 30 మే 2020
Beauty-tips - Mar 14, 2020 , 22:19:59

మొటిమలు వేధిస్తున్నాయా?

మొటిమలు వేధిస్తున్నాయా?

నెలసరికంటే ముందుగానే కొన్ని సంకేతాలు హెచ్చరిస్తాయి. అవే మొటిమలు. వీటిని మొదట్లోనే పరిష్కరించేందుకు కొన్ని చిట్కాలు.

  • ముఖం అందంగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే ప్రాడక్ట్స్‌ అన్నీ వాడుతుంటారు. ముందుగా జిడ్డు ప్రాడక్ట్స్‌ అయిన సన్‌స్క్రీన్స్‌, కాస్మొటిక్స్‌, ఆయిల్స్‌, కాన్సెలర్స్‌ని పక్కన పెట్టండి.
  • భద్రత కోసం వాడే హెల్మెట్‌, స్ట్రాప్స్‌, బిగుతుగా ఉండే కాలర్స్‌ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలి.
  • చర్మంపై యూవీ కిరణాలు పడకుండా జాగ్రత్త తీసుకోండి. వేసవిలో బయటి పనులు కాస్త తగ్గించుకుంటే మంచిది.
  • బయట ఎక్కడికి వెళ్లినా ఇంటికి రాగానే ముఖం శుభ్రంగా కడుగాలి. ఇంట్లోనే వ్యాయామాలు, వాకింగ్‌ చేయండి.


logo