బుధవారం 03 జూన్ 2020
Beauty-tips - Mar 13, 2020 , 23:09:44

బాటిల్‌ పెట్టుకునేలా..

బాటిల్‌ పెట్టుకునేలా..

నెయిల్‌పాలిష్‌ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా ఒక్కోసారి బాటిల్‌ టేబుల్‌ మీద నుంచి పక్కకు జరుగడమో, ఒలికిపోవడమో జరుగుతుంటుంది. అలా అని ఒక చేతిలో పట్టుకొని పెట్టుకోవడమూ సాధ్యం కాదు. అందుకోసమే ఈ హోల్డర్‌. సిలికాన్‌ రబ్బర్‌తో తయారు చేసిన ఈ హోల్డర్‌లో బాటిల్‌ని ఉంచాలి. దీన్ని వేళ్లకు తొడిగించుకొని ఆ తర్వాత నెయిల్‌పాలిష్‌ వేసుకోవడం ప్రారంభించాలి. గులాబి, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఈ హోల్డర్స్‌ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. దీని ధర మూడు వందల రూపాయలు మాత్రమే. logo