శనివారం 30 మే 2020
Beauty-tips - Mar 06, 2020 , 23:18:38

గోళ్లరంగు మారుతున్నదా?

గోళ్లరంగు మారుతున్నదా?

గోళ్లు మన శరీరంలో ఓ భాగమే కాదు. ఆరోగ్యాన్ని సూచించడానికి కూడా ఉపయోగపడుతాయి. అయితే కొంతమందికి గోళ్లు రంగు పాలిపోయినట్లుగా ఉంటాయి. ఇంకొంత మంది తరచూ గోళ్లకు రంగు వేసుకుంటుంటారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో సమస్యను ఎదుర్కొంటుంటారు? గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, అందంగా కనిపించడానికి కొన్నిచిట్కాలు.

  • గోళ్లకు నిరంతరం రంగు వేసుకోవడం మంచిది కాదు. వాటిల్లోని రసాయనాలు గోళ్లకే కాదు. చుట్టూ ఉండే చర్మానికీ హాని కలిగిస్తాయి.
  • గోళ్లను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే రంగు మారిన గోళ్లు బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
  • క్యూటికల్స్‌కి మాయిశ్చరైజర్‌, సహజ నూనెలతో రోజూ గోళ్లను మర్దన చేసుకోవాలి.
  • మానిక్యూర్‌, పెడిక్యూర్‌ వంటి వాటిని తరచూ చేసుకోకూడదు. తరచూ నెయిల్‌ పాలిష్‌ రిమూవర్లు వాడటం కూడా మంచిది కాదు. గోళ్లను ైస్టెల్‌ కోసం భిన్న ఆకృతుల్లో కత్తిరించడం వల్ల గోళ్ల ఎదుగుదల సరిగ్గా ఉండదు. 
  • గోళ్లకు వేసుకునే రంగులో టాల్యూన్‌, ఫార్మాల్డిహైడ్‌, ఎసిటోన్‌, పారాబెంజ్‌ వంటి రసాయనాలు ఉంటాయి. టాల్యూన్‌ వల్ల గోళ్ల చుట్టూ ఉన్న చర్మం పొడిబారిపోతుంది.
  • తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కూడా గోళ్లు తాజాగా కనిపిస్తాయి.


logo