శుక్రవారం 05 జూన్ 2020
Beauty-tips - Feb 21, 2020 , 22:35:37

మేకప్‌తో పనేంటి?

మేకప్‌తో పనేంటి?

ఫంక్షన్‌ అయినా, పార్టీ అయినా బయటికెళ్లాలంటే చాలు చాలామంది మేకప్‌ను ఆశ్రయిస్తుంటారు. మేకప్‌తో పని లేకుండా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు సహజంగా అందాన్ని పొందవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

  • ఎండ నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. ఎండకు కందిపోదు. ఎండకు బయటికి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మంచిది.
  • అందం కోసం సౌందర్య ఉత్పత్తుల మీద ఆధారపడవద్దు. చర్మ ఆరోగ్యానికి ఆహారం ప్రధానమైంది. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన చర్మం కావాలనుకునే వారు యాంటీ ఆక్సిడెంట్లు, కొల్లాజెన్‌ స్థాయిలు అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిది.
  • చర్మం కాంతివంతంగా ఉండేందుకు రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. దీంతో చర్మంలోని మలినాలు తొలిగిపోయి మొటిమలు రావు. నీళ్లు ఎక్కువగా తాగితే చర్మం మృదువుగా, నునుపుగా తయారవుతుంది.
  • కొందరి చర్మం పాలిపోయినట్లుగా, ముడతలు పడి ఉంటుంది. ఇందుకు నిద్రలేమి కూడా కారణంగా చెప్పొచ్చు. నిద్రపోవడం వల్ల కొల్లాజెన్‌ సహజంగా పెరుగుతుంది. దీనివల్ల చర్మం మెరుస్తుంది. 
  • మొబైల్‌ ఫోన్‌ ఎక్కువగా వాడడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ చేసుకోవడం మంచిది. ముబైల్‌ తెర ముఖానికి తాకితే మొటిమలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు.


logo