ఆదివారం 24 మే 2020
Beauty-tips - Feb 16, 2020 , 23:09:05

ఆలూ.. జుట్టుకు మేలు

ఆలూ.. జుట్టుకు మేలు

ఆహారపు అలవాట్లలో తేడా, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు రాలడం సహజమే. అలాగే రసాయనాలు కలిపిన షాంపులు వాడడం ద్వారా కేశాలకు ముప్పు తప్పదు. అయితే ఆలూతో సంరక్షించు కోవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

  • జుట్టు వత్తుగా పెరగాలంటే.. ఆలూ రసాన్ని నిమ్మరసాన్ని చేర్చి మాడుకు రాయాలి. దీంతో మాడుపై తేమ నిలుస్తుంది.
  • నిమ్మరసం, ఆలూ రసాన్ని సమానంగా కలిపి మాడుకు రాస్తే జుట్టు రాలే సమస్య ఉండదు. ఆలూ రసాన్ని 15 నిమిషాల పాటు మాడుకు పట్టించి మసాజ్‌ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
  • ఆలూ రసాన్ని జుట్టుకు పట్టించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. నెలకు మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.
  • ఆలూను తురుముకొని మిక్సీ పట్టించి వడగట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టించి శుభ్రపరుచుకుంటే సరిపోతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
  • జుట్టు పెరగాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. దీనివల్ల జుట్టు పెరుగుదలకు కావాలసిన క్యాల్షియం అందుతుంది. ఇందులోని క్యాల్షియం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  • జుట్టు పెరగాలంటే నిద్రించేముందు రెండు స్పూన్ల నూనెను తలకు రాసుకోవాలి. నూనెను కేశాలకు కాకుండా తలపై చర్మం, వెంట్రుకల మూలాలకు రాయాలి. మసాజ్‌ చేయడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. 


logo