శనివారం 30 మే 2020
Beauty-tips - Feb 14, 2020 , 22:52:42

అందం కేరాఫ్‌ ఆయుర్వేదం

అందం కేరాఫ్‌ ఆయుర్వేదం

  • తరచూ ముఖానికి పసుపు రాసుకునేవారికి మొటిమలు రావని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.  తలస్నానం చేసే గంట ముందు పాలల్లో, నీళ్లలో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది.
  • కొందరికి ఎన్ని షాంపూలు పెట్టినా చుండ్రు మాత్రం పోదు. ఇలాంటి వారు షాంపూలకు బదులు కుంకుడు కాయలను వాడాలి. అంతే కాకుండా తలస్నానం చేసే ముందు కురులకు కొబ్బరినూనెను బాగా పట్టించాలి. గంట తర్వాత కుంకుడు కాయలు రుద్దుకొని తలస్నానం చేస్తే జుట్టు బలంగా తయారవుతుంది. చుండ్రు రాదు.
  • ప్రస్తుతం చాలామంది చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్స్‌ వాడుతున్నారు. పూర్వం చర్మ సంరక్షణకు తాజా వెన్నను ఉపయోగించేవారు. దీనివల్ల వారి స్కిన్‌ లేతగా మారుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
  • పెదాలు పగిలిపోతే లిప్‌బామ్స్‌, క్రీమ్స్‌ ఏవీ వాడకుండా కొబ్బరినూనె, వెన్న కూడా వాడొచ్చు. చర్మ సంరక్షణకు పెసరపిండి, శనగపిండి, పసుపును చర్మానికి పట్టించి నలుగు పెడితే చర్మం కాంతివంతంగా మారుతుంది.


logo