శుక్రవారం 07 ఆగస్టు 2020
Beauty-tips - Feb 12, 2020 , 23:23:15

లిప్‌బామ్‌ ఇంట్లోనే..

లిప్‌బామ్‌ ఇంట్లోనే..

  • కాఫీ పొడి చర్మానికి మెరుగ్గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో  కాఫీ పొడి, తేనె తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్‌ చేసుకొని పది నిమిషాల పాటు పెదాలపై రుద్దాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే పెదవులు సున్నితంగా మృదువుగా మారుతాయి. 
  • ఒక గిన్నెలో అర టీస్పూన్‌ చక్కెర, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ను తీసుకోవాలి. బాగా మిక్స్‌ చేయాలి. రోజూ పెదవులకు రాస్తూ ఉంటే పెదవులు మృదువుగా, కోమలంగా తయారవుతాయి.
  • కొబ్బరి నూనె కూడా పెదవులకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మానికి కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు కాస్త కొబ్బరి నూనెతో పెదవుల్ని మర్దన చేయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
  • కొబ్బరి నూనెలో చక్కెర కలిపి ఈ మిశ్రమాన్ని పెదవులకు పది నిమిషాలు పట్టించాలి. ఈ మిశ్రమం పెదవులను పగులకుండా నివారిస్తుంది. పెదవులు పొడిబారకుండా చేస్తుంది. అర స్పూన్‌ దాల్చిన చెక్క పొడికి పావు స్పూన్‌ తేనె, పావు స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ చేర్చి బాగా కలిపి పెదాలకు రాసుకుంటే పెదాలు మెరిసిపోతాయి.
  • పాదాలు, పెదవుల పగుళ్లున్న చోట బాగా రుద్ది మసాజ్‌ చేయాలి. కాసేపయ్యాక తిరిగి నీటిలో కాళ్లను ఉంచి మళ్లీ బాగా రుద్దాలి. వారంలో మూడు సార్లు చేస్తే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు. కాళ్ల పగుళ్లు ఉన్న చోట గోరింటాకు పేస్ట్‌ను పట్టించి ఆరాక కడిగేస్తే పగుళ్లు క్రమంగా తగ్గుతాయి.


logo