శుక్రవారం 07 ఆగస్టు 2020
Beauty-tips - Feb 04, 2020 , 23:07:32

సొట్టబుగ్గలు ఇలా మీ సొంతం

సొట్టబుగ్గలు ఇలా మీ సొంతం

  • సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేటప్పుడు టెంపరరీగా సొట్టబుగ్గలు కావాలంటే వేలితో కానీ, పెన్సిల్‌తో కానీ బుగ్గ మీద ఓ అయిదు నిమిషాలు నొక్కి ఉంచితే బుగ్గలు టెంపరరీగా సొట్టపడతాయి.
  • మేకప్‌ వేసుకునేటప్పుడు ఓ చిన్న చిట్కా పాటించినా బుగ్గలమీద సొట్ట ఉన్నట్లు కనిపిస్తుంది. దానికోసం నవ్వేటప్పుడు మడతపడే చోట మన స్కిన్‌ రంగు కంటే కాస్త తక్కువ రంగు ఫౌండేషన్‌ను గుండ్రంగా ఐప్లె చేయాలి.
  • లిప్‌ స్టిక్‌ వేసుకోవడం చాలా తేలికైన పని కానీ చాలామంది పెదవులు లిప్‌స్టిక్‌ వేసుకున్నప్పటికీ ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. దీన్ని నివారించాలంటే ముందుగా పెదవులపై ఉన్న పొడితత్వాన్ని పోగొట్టాలి. ఇందుకు వారానికి రెండు సార్లు తేనె, పంచదార కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి రబ్‌ చేస్తే సాఫ్ట్‌గా తయారవుతాయి.
  • రోజ్‌వాటర్‌, గ్లిజరిన్‌ సమపాళ్లలో తీసుకొని దానిలో దూది ముంచి పెదాలకు రాసి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి నెల రోజులు చేస్తే చాలు పెదాలు మృదువుగా మారిపోతాయి.
  • అరటిపండు, పాలు, తేనె కలిపి మెత్తగా చేయాలి. దీనిలో కాస్త రోజ్‌ వాటర్‌ కూడా కలపాలి. దీంతో ముఖం, మెడ, కాళ్లు, చేతులకు రుద్ది కడిగేయాలి. వారానికోసారి ఇలా చేస్తే చర్మానికి ఎండ తగిలినా చర్మం పాడవదు.


logo