శనివారం 30 మే 2020
Beauty-tips - Jan 28, 2020 , 23:49:00

అవాంఛిత రోమాలకు చెక్

అవాంఛిత రోమాలకు చెక్

  • ‌వారం రోజుల పాటు రోజూ పాలలో పసుపు వేసి కలిపి ఆ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలున్న చోట పట్టించి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేస్తే రోమాలన్నీ తొలిగిపోతాయి. శనగపిండి, పసుపును సమపాళ్లలో కలిపి ముఖానికి ఫేషియల్‌ మాదిరిగా పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే అవాంఛిత రోమాల్ని నియంత్రించవచ్చు.
  • ఓ అరటిపండు గుజ్జు, 2 చెంచాల ఓట్‌మీల్‌ కలిపి ఆ మిశ్రమాన్ని రోమాల మీద పట్టిస్తే 20 నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ రుద్ది కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే అవాంఛిత రోమాల సమస్య క్రమంగా తగ్గుతుంది.
  • నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనెను అవాంచిత రోమాలపై మర్దన చేస్తే మెత్తని శనగపిండిని రాసి బాగా నొక్కి నలుగు పెట్టాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలిగిపోతాయి.


logo