శుక్రవారం 05 జూన్ 2020
Beauty-tips - Jan 23, 2020 ,

మెహందీ రంగు కోల్పోకూడదంటే?

మెహందీ రంగు కోల్పోకూడదంటే?

మెహందీ కోన్స్‌తో అరచేతులలో అందమైన డిజైన్స్‌ తీర్చిదిద్దుకోవాలని మహిళలు ముచ్చటపడుతుంటారు. కానీ మార్కెట్లో దొరికేవి బాగా రంగు రాకపోవడమో లేదంటే చర్మ సమస్యలు ఎదురవడమో జరుగుతుంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే ఇంటి దగ్గరే మెహందీ తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికినవి వాడినా ఎక్కువ రోజులు ఉండేలా చేయొచ్చు.

  • గిన్నెలో హెన్నా పొడి 100 గ్రాములు, కొద్దిగా ఆర్గానిక్‌ గోరింటాకు పొడి, 30 మి.లీ డిస్టిల్డ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ తీసుకోవాలి. వీటికి మూడు స్పూన్ల చక్కెర జత చేయాలి. తగినన్ని నీళ్లు కలపాలి. చిక్కగా అయిన తర్వాత ఆ మిశ్రమంపై  ఓ ప్లాస్టిక్‌ కవర్‌ కప్పి గంటపాటు ఉంచితే నాణ్యమైన గోరింటాకు రెడీ అవుతుంది.
  • గోరింటాకును చేతులపై ఎక్కువ సమయం ఉంచుకునే ప్రయత్నం చేయాలి. చక్కెర, నిమ్మరసం మిశ్రమాన్ని గోరింటాకుపై తడుపుతూ ఉండాలి. ఇలా చేస్తే  మంచి రంగు వస్తుంది.
  • ఇంగువ వేడి చేసి వచ్చే పొగపై గోరింటాకు పెట్టుకున్న చేతులను కాచుకోవాలి.   బాగా పండుతుంది.
  • గోరింటాకు పౌడర్‌ను ముందుగా నీళ్లలో నానబెట్టి అందులో అర చెంచా కాసు వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెట్టుకుంటే గోరింటాకు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటుంది.
  • పిప్పరమెంట్‌ను నూరి గోరింటాకు పేస్ట్‌కు కలిపితే బాగా ఎర్రగా పండుతుంది. మార్కెట్లో పిప్పరమెంట్‌ నూనె కూడా లభిస్తుంది. ఒక్కసారి వాడిన తర్వాత మిగిలిన  గోరింటాకును ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వారం, పది రోజుల తర్వాత మళ్లీ వాడుకోవచ్చు.


logo