గురువారం 04 జూన్ 2020
Beauty-tips - Jan 21, 2020 , 00:47:43

అప్పటికప్పుడు అందం

అప్పటికప్పుడు అందం

ముఖం అందంగా ఉండాలని ప్రయత్నించని మహిళలు ఉండరు. కొందరైతే ముఖాన్ని పదే పదే కడిగేస్తూ ఉంటారు. ఈ చిట్కాలు పాటిస్తే అప్పటికప్పుడు అందాన్ని పొందవచ్చు. 

  • గుప్పెడు తులసీ ఆకుల్ని మిక్సీలో వేసి రెండు టీ స్పూన్ల పెరుగు చేర్చి పేస్ట్‌లా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.ఈ ప్యాక్‌ను ముఖానికి ఐప్లె చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతమవుతుంది.
  • కొద్దిగా పసుపు, శనగపిండి తీసుకొని ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ఐప్లె చేయాలి. ఆరిన తర్వాత కడిగేస్తే ముఖం మెరుస్తుంది.
  • శనగపిండిలో కాస్తంత రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రపర్చుకోవాలి. వెంటనే చిక్కటి తేనెను ముఖంపై ఐప్లె చేయాలి. -15 నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
  • రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే రెండు చామంతి పూలను నీళ్లలో ఉడకబెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి బాగా కలుపుకోవాలి. రోజూ ఉదయం -బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మసాజ్‌ చేయాలి. రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే రోజంతా ముఖం తాజాగా కనిపిస్తుంది.


logo