శనివారం 30 మే 2020
Beauty-tips - Jan 20, 2020 , 00:26:06

8 రకాల నూనెలతో.. కురులకు సిరులు

8 రకాల నూనెలతో.. కురులకు సిరులు

జుట్టుకు అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి నూనె ఎంతో అవసరం. జుట్టుకు కావాల్సిన పోషకాలను అందించే 8 రకాల నూనెల గురించి తెలుసుకుందాం.

పామాయిల్ : జుట్టు సమస్యలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు దీనిని వాడాలి.  ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, విటమిన్ ఏ జుట్టుకు పోషకాలను అందిస్తాయి. ఏదైనా షాంపూలో పామాయిల్ కలిపి జుట్టుకు పెట్టుకుని తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
ఆలివ్ : ఈ నూనెతో వారానికి ఒకసారి జుట్టుకు మసాజ్ చేయాలి. ఇందులో ఉండే విటమిన్లు తలపై చర్మానికి బలాన్ని ఇస్తాయి. ఎగ్‌వైట్‌లో ఆలివ్‌నూనె, తేనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే తేడా తెలుస్తుంది.
ఆముదం : ఆముదాన్ని జుట్టుకు మర్దన చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా, నల్లగా తయారవుతుంది. ఆముదానికి ఆవనూనె కలిపిరాస్తే మరింత మంచిది.
బాదాం : వారానికి రెండుసార్లు బాదాం నూనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. త్వరగా జుట్టు పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
కొబ్బరి నూనె : కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి.. తలకు పట్టించి రాత్రంతా అలానే వదిలేయ్యాలి. ఉదయం గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జట్టు సమస్యలకు ఇది చక్కని పరిష్కారం.
ఆవనూనె : జుట్టు నల్లగా, ఒత్తుగా రావడానికి ఇది మంచి రెమిడీ. ఈ నూనె తలలో రక్తప్రసరణ సరిగా జరగడానికి ఉపయోగపడుతుంది.
సన్‌ఫ్లవర్ ఆయిల్ : దీనిని జుట్టుకు మితంగా వాడాలి. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె కలిపి వాడితే మంచిది.
గ్రేప్ సీడ్ ఆయిల్ : ఇది జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఒక టేబుల్ స్పూన్ గ్రేప్ సీడ్ ఆయిల్‌ను గోరువెచ్చగా కాచి తలకు రాయాలి. ఒక గంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది.


logo