శనివారం 30 మే 2020
Beauty-tips - Jan 19, 2020 , 01:38:18

పేను కొరుకుతున్నదా?

పేను కొరుకుతున్నదా?

పేను కొరుకుడు చాలామందిని వేధించే సమస్య. ముఖ్యంగా మహిళలకు తలపై కొద్దిపాటి ప్రాంతంలో వెంట్రుకలు రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్లీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. కానీ ఈ అలర్జీ తగ్గాలంటే మాత్రం కొన్ని చిట్కాలు పాటించాల్సిందే!

-గురివింద గింజల్ని అరగదీసి తలకు పట్టిస్తే పేలు మాయమవుతాయి. పేను కొరుకుడు సమస్య పరిష్కారమవుతుంది. రోజూ రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
-నెల రోజులపాటు రోజూ మూడు పూటలు మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది. మందార ఆకులతో సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకొని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు. పేను కొరుకుడు సమస్య తగ్గుతుంది.
-నిమ్మరసం, వెల్లుల్లి రసం సమంగా కలిపి పేను కొరికిన చోట రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే క్రమంగా వెంట్రుకలు పెరుగుతాయి. గుంటగలగర ఆకు రసంతో పేను కొరికిన చోట మర్దన చేసినా ఫలితం ఉంటుంది.
-పల్లేరుపూలు, నువ్వులపూలు, తేనె, నెయ్యి సమంగా కలిపి నూరి పేను కొరుకుడు మీద రాయాలి. క్రమం తప్పకుండా వారం పాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-బొప్పాయి చెట్టు పాలను పేను కొరుకుడు పైన రాసుకుంటే క్రమంగా ఆ ప్రదేశంలో తిరిగి జుట్టు వస్తుంది.logo